తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్

Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్

Hari Prasad S HT Telugu

12 November 2023, 16:30 IST

    • Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా అతడు నిలిచాడు.
శుభ్‌మన్ గిల్
శుభ్‌మన్ గిల్ (BCCI Twitter)

శుభ్‌మన్ గిల్

Shubman Gill Record: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించాడు. వరల్డ్ కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గిల్.. ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో 2000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా గిల్ నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు ఈ మైలురాయికి అతడు 17 పరుగుల దూరంలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. 2 వేల రన్స్ మైల్‌స్టోన్ అందుకున్నాడు. గిల్ కాకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో 1000కిపైగా రన్స్ చేయడం విశేషం. ఈ ఏడాది గిల్ మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 43 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. అందులో 49.6 సగటుతో 2034 రన్స్ చేశాడు.

గిల్ 2023లో ఏడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. వన్డే క్రికెట్ లోనూ ఈ ఏడాది అత్యధిక పరుగుల రికార్డు గిల్ పేరిటే ఉంది. ఈ ఏడాది అతడు 1500కుపైగా రన్స్ చేయడం విశేషం. 2023లో గిల్ కేవలం 27 వన్డే ఇన్నింగ్స్ లోనే 1500 రన్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సచిన్ టెండూల్కర్, మాథ్యూ హేడెన్ ల సరసన నిలిచాడు.

ఈ ఏడాది గిల్ కాకుండా వన్డేల్లో కోహ్లి, నిస్సంక, రోహిత్ శర్మ, డారిల్ మిచెల్, బాబర్ ఆజం, రిజ్వాన్ 1000కిపైగా రన్స్ చేశారు. ఇక ఓవరాల్ గా అన్ని ఫార్మాట్లు కలిసి ఈ ఏడాది 1000కిపైగా రన్స్ చేసిన వాళ్లు మరో 31 మంది ఉన్నారు. వరల్డ్ కప్ 2023లోనే గిల్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. ఇంతకు ముందు ఇదే టోర్నీలో వన్డేల్లో వేగంగా 2000 రన్స్ చేసిన హషీమ్ ఆమ్లా రికార్డును కూడా గిల్ బ్రేక్ చేశాడు.

ఇక ఇదే టోర్నీలో వన్డేల్లో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకున్నాడు. ఈ మధ్యే ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టి గిల్ నంబర్ 1 అయ్యాడు.

తదుపరి వ్యాసం