తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shikhar Dhawan: టీమిండియాకు దూర‌మైనా శిఖ‌ర్‌ ధావ‌న్ సంపాద‌న మాత్రం త‌గ్గ‌లేదు - మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే?

Shikhar Dhawan: టీమిండియాకు దూర‌మైనా శిఖ‌ర్‌ ధావ‌న్ సంపాద‌న మాత్రం త‌గ్గ‌లేదు - మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే?

06 December 2023, 9:23 IST

  • Shikhar Dhawan: టీమిండియాకు దూర‌మైన శిఖ‌ర్ ధావ‌న్ ఆస్తుల విలువ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఐపీఎల్‌తో పాటు బ్రాండ్స్‌, స్టార్ట‌ప్ కంపెనీల ద్వారా ధావ‌న్ భారీగా సంపాదిస్తోన్నాడు. అత‌డి మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే?

శిఖ‌ర్ ధావ‌న్
శిఖ‌ర్ ధావ‌న్

శిఖ‌ర్ ధావ‌న్

Shikhar Dhawan: శిఖ‌ర్ ధావ‌న్ టీమిండియాకు దూర‌మై చాలా కాల‌మ‌వుతోంది. యంగ్ క్రికెట‌ర్ల‌ పోటీతో మూడు ఫార్మెట్స్‌లో ధావ‌న్ స్థానం కోల్పోయాడు. ఒక‌ప్పుడు బీసీసీఐ కాంట్రాక్ట్‌ల‌లో ఏ గ్రేడ్ క్రికెట‌ర్‌గా కొన‌సాగిన ధావ‌న్ ఇప్పుడు సీ గ్రేడ్‌కు ప‌డిపోయాడు. ధావ‌న్ టీమిండియాకు దూర‌మైన అత‌డి సంపాద‌న మాత్రం త‌గ్గ‌లేదు. శిఖ‌ర్ ధావ‌న్ ఆస్తుల‌ను ఓ మ్యాగ‌జైన్ వెల్ల‌డించింది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ధావ‌న్ మొత్తం ఆస్తుల విలువ 125 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం బీసీసీఐ సీ గ్రేడ్ కాంట్రాక్ట్ ద్వారా ధావ‌న్‌కు ఏడాదికి కోటి రూపాయ‌ల ఆదాయం వ‌స్తోంది. అలాగే ఐపీఎల్ ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌లు ధావ‌న్ ద‌క్కించుకుంటున్నాడు. బ్రాండ్స్ ద్వారా ధావ‌న్ భారీగానే ఆర్జిస్తున్న‌ట్లు మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బోట్‌, కుర్‌కురే, జియోతో పాటు ప‌లు సంస్థ‌లకు సంబంధించిన యాడ్స్‌లో ధావ‌న్ న‌టిస్తున్నాడు.

ఒక్కో యాడ్ కోసం ధావ‌న్ కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. వీటితో పాటు ధావ‌న్ కొన్ని స్టార్ట‌ప్ కంపెనీల‌లో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. వాటి ద్వారా ప్ర‌తి ఏటా 70 కోట్ల‌కుపైనే ఆదాయం సొంతం చేసుకుంటున్న‌ట్లు తెలిసింది.

వీటితో పాటు కోటిన్న‌ర విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారుతో పాటు ఖ‌రీదైన స్పోర్ట్స్ బైకులు ధావ‌న్ వ‌ద్ద ఉన్న‌ట్లు ఆ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. క్రికెట్‌, బ్రాండ్స్‌తో పాటు స్టార్ట‌ప్ కంపెనీల ద్వారా ధావ‌న్ భారీగానే సంపాదిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ధావ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 11 మ్యాచుల్లో 373 ర‌న్స్ చేశాడు ధావ‌న్‌.

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం