తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shaheen Afridi: పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది - వ‌న్డే కెప్టెన్‌ ప్లేస్ ఖాళీ!

Shaheen Afridi: పాకిస్థాన్ టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది - వ‌న్డే కెప్టెన్‌ ప్లేస్ ఖాళీ!

17 November 2023, 12:12 IST

  • Shaheen Afridi: వ‌ర‌ల్డ్ క‌ప్ వైఫ‌ల్యంతో పాకిస్థాన్ జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజాం త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో పాకిస్థాన్ టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది నియ‌మితుడ‌య్యాడు. వ‌న్డే కెప్టెన్‌గా ఎవ‌రిని ప్ర‌క‌టించ‌లేదు.

షాహీన్ అఫ్రిది
షాహీన్ అఫ్రిది

షాహీన్ అఫ్రిది

Shaheen Afridi: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ జ‌ట్టు లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ వైఫ‌ల్యానికి బాధ్య‌త వ‌హిస్తూ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజాం త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో సార‌థ్య బాధ్య‌త‌ల్ని ఇద్ద‌రు ప్లేయ‌ర్స్‌కు అప్ప‌గించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని నియ‌మించింది.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

టెస్ట్ ప‌గ్గాల‌ను షాన్ మ‌సూద్‌కు అప్ప‌గించింది. వ‌న్డే సార‌థి ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. 2024 న‌వంబ‌ర్ వ‌ర‌కు పాకిస్థాన్ వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడ‌టం లేదు. అందుకే వ‌న్డే జ‌ట్టు కెప్టెన్‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని తెలుస్తోంది.

పాకిస్థాన్ టీ20 జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆనందం వ్య‌క్తం చేశాడు షాహీన్ అఫ్రిది. టీ20 జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించ‌డం గౌర‌వంతో పాటు బాధ్య‌త‌గా భావిస్తున్న‌ట్లు షాహీన్ పేర్కొన్నాడు. జ‌ట్టులో సోద‌ర‌భావం పెంపొందిస్తూ ఓ ఫ్యామిలీలా క‌లిసి టీమ్‌ను ముందుకు న‌డిపించ‌డానికే కృషి చేస్తాన‌ని తెలిపాడు. ఏ జ‌ట్టు గెలుపు అయినా స‌మిష్టిత‌త్వం, హార్డ్‌వ‌ర్క్‌పైనే ఆధారాప‌డి ఉంటుంది.

అలాంటి స్ఫూర్తిని ఎల్ల‌వేళాల టీమ్‌లో నింపుతూ దేశానికి పేరుప్ర‌ఖ్యాత‌లు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని త‌న ట్వీట్‌లో షాహీన్ పేర్కొన్నాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్ విఫ‌ల‌మైన‌ప్ప‌టి నుంచే బాబర్ ఆజాంపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బాబ‌ర్ ఆజాం బ్యాటింగ్‌లో రాణించినా అత‌డిని కెప్టెన్‌ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ప‌లువురు పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్లు డిమాండ్ చేశారు. వారి కామెంట్స్ నేప‌థ్యంలో బాబ‌ర్ ఆజాం కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి వైదొలిగించాడు. బాబ‌ర్ ఆజాంకు షాహీన్ స‌పోర్ట్‌గా నిలిచాడు. బాబ‌ర్ అద్భుత‌మైన కెప్టెన్ అనీ, అత‌డి నాయ‌క‌త్వంలో పాకిస్థాన్ ఎన్నో గొప్ప విజ‌యాల్ని సాధించింద‌ని తెలిపాడు. బ్యాట్స్‌మెన్‌గా అత‌డి మ‌రిన్ని గొప్ప రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టాల‌ని బాబ‌ర్ ఆజాంను ఉద్దేశించి షాహీన్ ట్వీట్ చేశాడు.

తదుపరి వ్యాసం