తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ద్రావిడ్ కోస‌మైనా క‌ప్ గెలుస్తాం - కోచ్‌పై రోహిత్ ప్ర‌శంస‌లు

Rohit Sharma: ద్రావిడ్ కోస‌మైనా క‌ప్ గెలుస్తాం - కోచ్‌పై రోహిత్ ప్ర‌శంస‌లు

18 November 2023, 20:45 IST

  • Rohit Sharma Rahul Dravid:: టీమిండియా ఫైన‌ల్ చేర‌డంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర చాలా ఉంద‌ని రోహిత్ శ‌ర్మ అన్నాడు. క‌ష్ట‌స‌మ‌యాల్లో ద్రావిడ్ త‌మ వెన్నంటి నిలిచాడ‌ని, అత‌డి కోస‌మైనా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తామ‌ని రోహిత్ శ‌ర్మ తెలిపాడు. 

రోహిత్ శ‌ర్మ, రాహుల్ ద్రావిడ్
రోహిత్ శ‌ర్మ, రాహుల్ ద్రావిడ్

రోహిత్ శ‌ర్మ, రాహుల్ ద్రావిడ్

Rohit Sharma Rahul Dravid: క‌ష్ట‌స‌మ‌యాల్లో కోచ్ రాహుల్ ద్రావిడ్ త‌మ‌కు అండ‌గా నిలిచాడ‌ని, అత‌డికోస‌మైన వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి తీరుతామ‌ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాతో పోరుకు టీమిండియా సిద్ధ‌మైంది. ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా ఫైన‌ల్ ఫైట్ జ‌రుగ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

ఈ ఫైన‌ల్ ఫైట్ గురించి శ‌నివారం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో రోహిత్ శ‌ర్మ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. టీమిండియా ఫైన‌ల్ చేరుకోవ‌డంలో రాహుల్ ద్రావిడ్ పాత్ర చాలా ఉంద‌ని రోహిత్ శ‌ర్మ చెప్పాడు.

"కెప్టెన్ చెప్పిన అన్ని స‌ల‌హాల్ని సూచ‌న‌ల్ని కోచ్ పాటించాల‌ని లేదు. కానీ ద్రావిడ్ విష‌యంలో మాత్రం అంత భిన్నంగా సాగుతుంది. నాతో పాటు ఆట‌గాళ్ల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. మైదానంలో ఎలా ఆడాల‌ని అనుకుంటారో అలాగే ఆడండి అని ఎప్పుడూ చెబుతుంటాడు. ద్రావిడ్‌ మార్గ‌ద‌ర్శ‌నం వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రాణించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది" అని రోహిత్ శ‌ర్మ తెలిపాడు. అత‌డి కోస‌మైన వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి తీరుతామ‌ని తెలిపాడు.

"టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్‌లో ఓట‌మి మా అంద‌రికి క‌ఠిన ప‌రీక్ష‌గా నిలిచింది. ఆ క్లిష్ట స‌మ‌యంలో మా అంద‌రికి ద్రావిడ్‌ అండ‌గా నిలిచాడు" అని రోహిత్ తెలిపాడు.

విమ‌ర్శ‌లు, ఓట‌ముల ప్ర‌భావం ఆట‌గాళ్ల‌పై ఎక్కువ‌గా పండ‌కుండా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎల్ల‌ప్పుడూ పాజిటివ్‌నెస్ ఉండేలా ద్రావిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని రోహిత్ శ‌ర్మ తెలిపాడు. ద్రావిడ్‌ను ఉద్దేశించి రోహిత్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

తదుపరి వ్యాసం