తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Neeraj Chopra Rinku Singh: రింకూ సింగ్‌ క‌ల తీరింది - నీర‌జ్ చోప్రాను క‌లిసిన ఐపీఎల్ స్టార్ - ఫొటో వైర‌ల్‌

Neeraj Chopra Rinku Singh: రింకూ సింగ్‌ క‌ల తీరింది - నీర‌జ్ చోప్రాను క‌లిసిన ఐపీఎల్ స్టార్ - ఫొటో వైర‌ల్‌

HT Telugu Desk HT Telugu

28 September 2023, 11:24 IST

  • Neeraj Chopra Rinku Singh: ఒలింపిక్ విన్న‌ర్ నీర‌జ్ చోప్రాను క‌ల‌వాల‌నే త‌న కోరిక‌ను నెర‌వేర్చుకున్నాడు టీమ్ ఇండియా క్రికెట‌ర్ రింకూ సింగ్‌. నీర‌జ్ చోప్రాతో దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నీర‌జ్ చోప్రా, రింకూ సింగ్
నీర‌జ్ చోప్రా, రింకూ సింగ్

నీర‌జ్ చోప్రా, రింకూ సింగ్

Neeraj Chopra Rinku Singh: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రాను క‌లుసుకున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌కు హంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌ వేదిక‌గా మారింది. ఏషియ‌న్ గేమ్స్ కోసం అనౌన్స్ చేసిన యంగ్‌స్ట‌ర్‌తో కూడిన జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు రింకూ సింగ్‌.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే.. క్వాలిఫయర్-1లో హైదరాబాద్

RR vs KKR: రాజస్థాన్, కోల్‍కతా మ్యాచ్‍ వర్షార్పణం.. హైదరాబాద్‍కు జాక్‍పాట్.. రెండో ప్లేస్‍ దక్కించుకున్న సన్‍రైజర్స్

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

ఈ ప్ర‌తిష్టాత్మ‌క గేమ్స్ ద్వారా తొలిసారి జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలో దిగుతోన్నాడు. ఏషియ‌న్ గేమ్స్‌కు ముందు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో ఒలింపిక్ విన్న‌ర్‌ నీర‌జ్ చోప్రాను క‌ల‌వాల‌న్న‌ది త‌న క‌ల అని రింకూ సింగ్ తెలిపాడు. త‌న క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు.

ఏషియ‌న్ గేమ్స్ కోసం మెన్స్ క్రికెట్ టీమ్ బుధ‌వారం చైనా చేరుకున్న‌ది. ఈ గేమ్స్ కోసం నీర‌జ్ చోప్రా కూడా చైనా బ‌య‌లుదేరాడు. హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో నీర‌జ్ చోప్రాను మెన్స్ క్రికెట్ టీమ్ క‌లుసుకున్న‌ది. ఈ సంద‌ర్భంగా త‌న అభిమాన అథ్లెట్ తో రింకూ సింగ్ ఫొటో దిగాడు.

ఈ ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. నేష‌న‌ల్ డ్యూటీ ఇన్ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించాడు. నీర‌జ్ చోప్రాతో రింకూ సింగ్ దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్పోర్ట్స్ ల‌వ‌ర్స్‌ను ఈ ఫొటో ఆక‌ట్టుకుంటోంది.

ఐపీఎల్ హీరో...

ఐపీఎల్ 2023 ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు రింకూ సింగ్‌. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో ఐదు సిక్స్‌లు కొట్ట‌డంతో ఒక్క‌సారిగా హీరోగా మారాడు. ఈ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ 59 యావ‌రేజ్‌తో 474 ర‌న్స్ చేశాడు. ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు.

For latest cricket news, live score, IPL stay connected with HT Telugu
తదుపరి వ్యాసం