తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup 2023: అలా జరిగితే ఇండియా ఇంటికే.. నేపాల్ మ్యాచ్‍కు వర్షం ముప్పు

Asia Cup 2023: అలా జరిగితే ఇండియా ఇంటికే.. నేపాల్ మ్యాచ్‍కు వర్షం ముప్పు

Sanjiv Kumar HT Telugu

04 September 2023, 8:49 IST

  • India Vs Nepal Asia Cup 2023: ఆసియా కప్ 2023 భారత్ మ్యాచులకు వర్షం పెద్ద గండంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్‍తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు మళ్లీ నేపాల్ మ్యాచ్‍కు వరుణుడు ముప్పు తెచ్చేలా ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇండియా పరిస్థితి ఏంటనే వివరాల్లోకి వెళితే..

ఇండియా నేపాల్ మ్యాచ్‍కు వర్షం ముప్పు
ఇండియా నేపాల్ మ్యాచ్‍కు వర్షం ముప్పు

ఇండియా నేపాల్ మ్యాచ్‍కు వర్షం ముప్పు

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. కానీ, వరుణుడు మాత్రం ఆటకు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. ఇప్పటికే శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబర్ 2న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అప్పటికే ఓ విజయంతో పాక్ ఉండగా.. ఇండియాకు తొలి మ్యాచ్ రద్దయి నిరాశపరిచింది. మ్యాచ్ రద్దు కారణంగా చెరో పాయింట్ వచ్చిప్పటికీ ఆసియా కప్‍లో ఇండియా భవిష్యత్ నేపాల్‍తో జరిగే మ్యాచ్‍పై ఆధాపడి ఉంది. పాకిస్తాన్ ఇదివరకే సూపర్ 4లోకి ఎంట్రీ కాగా ఇండియా వెళ్తుందా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

పసికూన అయినా నేపాల్‍పై భారత్ సునాయసంగా విజయం సాధించి సూపర్ 4లోకి అడుగు పెడుతుంది అని అంతా భావించారు. కానీ, దానికి వరుణుడు అడ్డుగా మారనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మళ్లీ పల్లెకెలె వేదికగా సోమవారం (సెప్టెంబర్ 4)న నేపాల్‍తో జరిగే ఇండియా మ్యాచ్ జరగనుంది. ఈ పల్లెకెలెలో 89 శాతంగా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు క్యాండీలోని వాతావరణ కేంద్రం నివేదికలు ఇచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్న సమయంలోనే వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ సజావుగా సాగే ఛాన్స్ కనిపించడం లేదు. ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ తరహాలనే ఈ గేమ్ కూడా రద్దు అయితే ఇండియా, నేపాల్‌కు చెరో పాయింట్ వస్తుంది. గ్రూప్ ఏలో ఇండియా, పాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. వీటిలో పాక్ ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లు, 2వ మ్యాచుతో 1 పాయింట్.. మొత్తంగా 3 పాయింట్స్ దక్కించుకుంది. దీంతో గ్రూప్ 4 దశకు అర్హత సాధించింది. ఇక భారత్‍కు ఒక్క పాయింటే వచ్చింది. నేపాల్ పోరులో విన్ అయితేనే రెండు పాయింట్స్ వచ్చి గ్రూప్ 4లోకి అడుగుపెడుతుంది. లేకుంటే వర్షం వల్ల రద్దు అయితే రెండు పాయింట్స్ తో పాక్ తర్వాతి స్థానంలో ఉంటుంది. ఒకవేళ ఈ రెండు కాక ఓడిపోతే మాత్రం భారత్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం