తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pak Vs Afg Scorecard: చివర్లో చెలరేగిన ఇఫ్తికార్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు మోస్తరు టార్గెట్ ఉంచిన పాకిస్థాన్

Pak vs Afg Scorecard: చివర్లో చెలరేగిన ఇఫ్తికార్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు మోస్తరు టార్గెట్ ఉంచిన పాకిస్థాన్

Hari Prasad S HT Telugu

23 October 2023, 17:51 IST

    • Pak vs Afg Scorecard: ఆఫ్ఘనిస్థాన్ ముందు మోస్తరు లక్ష్యం ఉంచింది పాకిస్థాన్. మొదట అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం హాఫ్ సెంచరీలు.. చివర్లో ఇఫ్తికార్ మెరుపు ఇన్నింగ్స్ తో పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 రన్స్ చేసింది.
హాఫ్ సెంచరీలు చేసిన అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం
హాఫ్ సెంచరీలు చేసిన అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం (PTI)

హాఫ్ సెంచరీలు చేసిన అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం

Pak vs Afg Scorecard: వరల్డ్ కప్ 2023లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన పాకిస్థాన్.. చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించింది. స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 రన్స్ చేసింది. కెప్టెన్ బాబర్, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ హాఫ్ సెంచరీలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

అయితే చివర్లో ఇఫ్తికార్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాకిస్థాన్ మంచి స్కోరు సాధించగలిగింది. కెప్టెన్ బాబర్ ఆజం 92 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఇక ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 75 బంతుల్లో 58 రన్స్ చేసి మరోసారి రాణించాడు. ఒక దశలో పాకిస్థాన్ 41.5 ఓవర్లలో 206 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. బాబర్ అప్పుడే ఔటయ్యాడు.

ఈ సమయంలో పాక్ అసలు 250 అయినా చేస్తుందా అన్న సందేహం కలిగింది. అయితే ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ చెలరేగాడు. మెల్లగా మొదలుపెట్టి తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. అతడు 27 బంతుల్లోనే 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. మరోవైపు షాదాబ్ ఖాన్ కూడా 38 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఈ వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్న మహ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ 10 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అతడు మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లాంటి కీలకమైన బ్యాటర్లను అతడు ఔట్ చేయడం విశేషం.

తదుపరి వ్యాసం