తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Siraj Vs Shubman Gill: ఆ అవార్డు కోసం శుభ్‌మన్ గిల్, సిరాజ్ పోటీ.. దక్కేది ఎవరికి?

Siraj vs Shubman Gill: ఆ అవార్డు కోసం శుభ్‌మన్ గిల్, సిరాజ్ పోటీ.. దక్కేది ఎవరికి?

Hari Prasad S HT Telugu

10 October 2023, 12:38 IST

    • Siraj vs Shubman Gill: ఆ అవార్డు కోసం శుభ్‌మన్ గిల్, సిరాజ్ పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరితో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కేది ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మహ్మద్ సిరాజ్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మహ్మద్ సిరాజ్ (ANI)

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో మహ్మద్ సిరాజ్

Siraj vs Shubman Gill: టీమిండియాలో గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ప్లేయర్స్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్. ఇప్పుడీ ఇద్దరూ సెప్టెంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ప్రతి నెలా ఇచ్చే ఈ అవార్డు కోసం ఐసీసీ ఈ ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ తోపాటు ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

ప్రస్తుతం డెంగ్యూతో బాధపడుతూ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ కు దూరమైన శుభ్‌మన్ గిల్.. సెప్టెంబర్ లో ఆసియా కప్ తోపాటు ఆస్ట్రేలియాతో సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. ఆ నెలలో గిల్ 8 వన్డేల్లో ఏకంగా 80 సగటుతో 480 రన్స్ చేయడం విశేషం. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై, స్వదేశంలో ఆస్ట్రేలియాపై ఆ సెంచరీలు చేశాడు. దీంతో అతనికి రెండో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా ఈ రేసులో ఉన్నాడు. సెప్టెంబర్ లో సిరాజ్ ఆరు వన్డేల్లో 11 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై సిరాజ్ అదిరిపోయే బౌలింగ్ ను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతోపాటు మొత్తంగా మ్యాచ్ లో 6 వికెట్లు తీయడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ కళ్లు చెదిరే స్పెల్ తో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో సిరాజ్ నిలిచాడు.

మరోవైపు ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ కూడా వన్డేల్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు. సెప్టెంబర్ లో మలన్ వన్డేల్లో ఏకంగా 92.33 సగటుతో 277 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేసి ఈ అవార్డు రేసులో ఉన్నాడు.

ఇక ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులోనూ ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఇద్దరు సౌతాఫ్రికన్లు కాగా.. మరొకరు శ్రీలంక టీమ్ కెప్టెన్. సౌతాఫ్రికా ఆల్ రౌండర్ నాదిన్ డి క్లెర్క్, లారా వోల్వార్ట్ లతోపాటు శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు సెప్టెంబర్ నెలకుగాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉన్నారు.

తదుపరి వ్యాసం