తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Irfan Pathan: పాకిస్థాన్‌లో నన్ను మేకుతో కొట్టారు.. కానీ ఇలా చేయలేదు: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: పాకిస్థాన్‌లో నన్ను మేకుతో కొట్టారు.. కానీ ఇలా చేయలేదు: ఇర్ఫాన్ పఠాన్

Hari Prasad S HT Telugu

19 October 2023, 19:14 IST

    • Irfan Pathan: పాకిస్థాన్‌లో నన్ను మేకుతో కొట్టారు.. కానీ ఇలా చేయలేదు అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పటి ఘటనను పంచుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ ను అవమానించారంటూ పీసీబీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇర్ఫాన్ ఆ పాత ఘటనను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
తనను మేకుతో కొట్టినట్లు అంపైర్ కు ఫిర్యాదు చేస్తున్న ఇర్ఫాన్ పఠాన్
తనను మేకుతో కొట్టినట్లు అంపైర్ కు ఫిర్యాదు చేస్తున్న ఇర్ఫాన్ పఠాన్

తనను మేకుతో కొట్టినట్లు అంపైర్ కు ఫిర్యాదు చేస్తున్న ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: పాకిస్థాన్ లో తనను స్టాండ్స్ లోని అభిమానులు మేకుతో కొట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అహ్మదాబాద్ లో పాక్ క్రికెటర్ రిజ్వాన్ తో అక్కడి ప్రేక్షకులు అమర్యాదగా ప్రవర్తించారంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇర్ఫాన్ అప్పటి ఘటనను గుర్తు చేసుకోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Babar Azam Record: టీ20ల్లో బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లినే మించిపోయాడు

Deepak Chahar: ఇది రియ‌ల్ లైఫ్ సైంధ‌వ్ మూవీ - హీరోగా నిలిచిన టీమిండియా క్రికెట‌ర్‌ దీప‌క్ చాహ‌ర్‌

DC vs LSG: లక్నోకు భారీ దెబ్బేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్‍లో అలవోకగా గెలిచిన పంత్ సేన

DC vs LSG: స్టబ్స్, పోరెల్ మెరుపులు.. ఢిల్లీ దీటైన స్కోరు.. సూపర్ క్యాచ్ పట్టిన రాహుల్.. చప్పట్లతో అభినందించిన ఓనర్

ఇర్ఫాన్ పఠాన్ గురువారం (అక్టోబర్ 19) ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లో కామెంటరీ ఇస్తూ.. పాకిస్థాన్ లో అభిమానులు తనతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్ టూర్ కు వెళ్లినప్పుడు పెషావర్ లో మ్యాచ్ సందర్భంగా ఎవరో తనపైకి మేకు విసిరినట్లు అతడు చెప్పాడు.

"మేము పెషావర్ లో మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు ఓ అభిమాని నాపైకి మేకు విసిరాడు. అది నా కన్ను కింద బలంగా తగిలింది. నాకు తీవ్ర గాయం అయ్యేది. మ్యాచ్ 10 నిమిషాల పాటు ఆగిపోయింది. అయినా మేము దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం" అని ఇర్ఫాన్ తన కామెంటరీలో వెల్లడించాడు.

ఇర్ఫాన్ ఈ ఘటనను గుర్తు చేయడాన్ని ప్రశంసిస్తూ మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. "ఇర్ఫాన్ పఠాన్ ను మేకుతో కొట్టినట్లు నాకు తెలియదు. ఎవరో అభిమాని వల్ల మ్యాచ్ కాసేపు ఆగినట్లు మాత్రం తెలుసు. కానీ ఈరోజే నాకు అసలు కారణం తెలిసింది. ఆ విషయం చెప్పినందుకు ఇర్ఫాన్ ను ప్రశంసిస్తున్నా" అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

దీనికి కూడా ఇర్ఫాన్ రిప్లై ఇచ్చాడు. "నేను ఈ విషయం ఎప్పిటికీ చెప్పేవాడిన కాదు బ్రదర్. ఈ ఆటకు అభిమానులు చాలా ముఖ్యం. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజుల్లో భిన్నంగా స్పందిస్తున్నారు. అనవసరమైన నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. అందుకే ఆ విషయం చెప్పాను" అని ఇర్ఫాన్ ట్వీట్ చేశాడు.

అహ్మదాబాద్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ రిజ్వాన్ పట్ల అభిమానులు అనుచితంగా ప్రవర్తించారంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం