తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Pbks: 15 నెలల తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్.. టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే..

DC vs PBKS: 15 నెలల తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్.. టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే..

23 March 2024, 15:19 IST

    • IPL 2024 DC vs PBKS: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు షురూ అయింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 15 నెలల తర్వాత మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది పంజాబ్.
DC vs PBKS: 15 నెలల తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్.. టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే..
DC vs PBKS: 15 నెలల తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్.. టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే..

DC vs PBKS: 15 నెలల తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్.. టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే..

DC vs PBKS: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ సీజన్‍లో రెండో రోజు మధ్యాహ్నం మ్యాచ్‍లో ఈ ఇరు జట్లు తలపడనుతున్నాయి. ముల్లాన్‍పూర్ కొత్త స్టేడియం వేదికగా నేడు (మార్చి 23) పంజాబ్, ఢిల్లీ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ముందుగా ఢిల్లీ బ్యాటింగ్‍కు దిగనుంది.

ట్రెండింగ్ వార్తలు

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

IPL 2024 RR vs PBKS: చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు.. వరుసగా నాలుగో ఓటమి తప్పదా?

రిషబ్ పంత్ రిటర్న్

భారత స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సుమారు 15 నెలల తర్వాత మళ్లీ ఆటకు బరిలోకి దిగాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పటి నుంచి క్రికెట్‍కు దూరమయ్యాడు పంత్. గతేడాది ఐపీఎల్ కూడా ఆడలేదు. తీవ్రంగా కష్టపడి ఇటీవలే కోలుకున్నాడు. ఇప్పుడు సుమారు 15 నెలల తర్వాత మళ్లీ బరిలో మ్యాచ్‍కు దిగాడు. దీంతో పంత్‍పైనే అందరి దృష్టి ఉండనుంది.

భావోద్వేగ సమయమిది..

చాలా విరామం మళ్లీ ఆడుతుండడంతో తనకు ఇది భావోద్వేగ సమయమని టాస్ సమయంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు. ఎక్కువగా ఆలోచించకుండా ఆటను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానని అన్నాడు. తాము చాలా బాగా సిద్ధమయ్యాయమని అన్నాడు. విదేశీ ప్లేయర్లు షాయ్ హోప్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, ట్రిస్టన్ స్టబ్స్ ఈ మ్యాచ్ తుది జట్టులో ఉన్నారని తెలిపాడు.

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఎన్రిచ్ నార్జే గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో అతడు లేడు. దీంతో ఢిల్లీ పేస్ విభాగంలో లోటు కనిపిస్తోంది. అలాగే, పృథ్వి షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రికీ భూయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమీత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్‍స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్

గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్టు తీవ్రంగా నిరాశపరిచాయి. పంత్ గైర్హాజరీలో ఢిల్లీ జట్టుకు గతేడాది డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ చేశాడు. ఆ జట్టు 14 మ్యాచ్‍ల్లో 5 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు గతేడాది సీజన్‍లో 14 మ్యాచ్‍ల్లో ఆరు మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల టేబుల్‍‍లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్లు ఉన్నా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. దీంతో ఈ 2024 సీజన్‍లో సత్తాచాటాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం