తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl Asia Cup Final Highlights: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. 8వసారి ఆసియాకప్ టైటిల్ దక్కించుకున్న భారత్
IND vs SL Asia Cup Final: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. 8వసారి ఆసియాకప్ టైటిల్ దక్కించుకున్న భారత్
IND vs SL Asia Cup Final: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. 8వసారి ఆసియాకప్ టైటిల్ దక్కించుకున్న భారత్ (AFP)

IND vs SL Asia Cup Final Highlights: శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. 8వసారి ఆసియాకప్ టైటిల్ దక్కించుకున్న భారత్

17 September 2023, 15:39 IST

Asia Cup 2023: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. 8వ సారి ఆసియాకప్ టైటిల్‍ను భారత్ దక్కించుకుంది. 51 పరుగుల లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది.

17 September 2023, 18:37 IST

ఆసియా రికార్డును కొనసాగించిన భారత్

అత్యధికసార్లు ఆసియాకప్ టైటిళ్లను కైవసం చేసుకున్న జట్టుగా భారత్ రికార్డును కొనసాగించింది. నేడు శ్రీలంకపై ఫైనల్‍లో గెలిచి 8వసారి ఆసియాకప్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. ఇండియా తర్వాత ఆరు ఆసియా ట్రోఫీలతో రెండో స్థానంలో ఉంది శ్రీలంక.

17 September 2023, 18:08 IST

శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. 8వసారి ఆసియాకప్ టైటిల్ దక్కించుకున్న భారత్

ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. 51 పరుగుల లక్ష్యాన్ని కేవలం 61 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. 10 వికెట్ల తేడాతో భారీ గెలుపు దక్కించుకుంది. 8వ సారి ఆసియాకప్ టైటిల్‍ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇషాన్ కిషన్ (23 నాటౌట్), శుభ్‍మన్ గిల్ (27) నాటౌట్ దూకుడుగా ఆడి టీమ్‍ను సులువుగా గెలిపించారు. అంతకు ముందు సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగటంతో శ్రీలంక 15.2 ఓవర్లలో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. 

17 September 2023, 17:54 IST

స్వల్ప లక్ష్యాన్ని ఊదేస్తున్న భారత ఓపెనర్లు

స్వల్ప లక్ష్యఛేదనను టీమిండియా దూకుడుగా మొదలుపెట్టింది. మూడు ఓవర్లలోనే 32 పరుగులు చేసింది భారత్. ఓపెనర్లు శుభ్‍మన్ గిల్ (18 నాటౌట్), ఇషాన్ కిషన్ (13 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నారు. 

17 September 2023, 17:42 IST

బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా

శ్రీలంకతో జరుగుతున్న ఆసియాకప్ 2023 ఫైనల్‍లో 51 పరుగుల లక్ష్యఛేదనను టీమిండియా మొదలుపెట్టింది. ఇషాన్ కిషన్, శుభ్‍మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‍కు రాలేదు.

17 September 2023, 17:18 IST

IND vs SL Asia Cup Final Live Updates: 50 పరుగులకే ఆలౌటైన శ్రీలంక.. నిప్పులు చెరిగిన సిరాజ్

ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకను కుప్పకూల్చింది టీమిండియా. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే ఆలౌటైంది. ఆరు వికెట్లతో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగి అద్భుతం చేశాడు. హార్దిక్ పాండ్యాకు మూడు, జస్‍ప్రీత్ బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.  

17 September 2023, 16:58 IST

కుప్పకూలుతున్న శ్రీలంక.. 8వ వికెట్ డౌన్

శ్రీలంక బ్యాటర్ దునిత్ వెల్లలాగే(8)ను 13వ ఓవర్లో ఔట్ చేశాడు భారత బౌలర్ హార్దిక్ పాండ్యా. దీంతో 12.3 ఓవర్లలో 40 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది శ్రీలంక. 

17 September 2023, 16:46 IST

ఆరో వికెట్ దక్కించుకున్న సిరాజ్‍.. శ్రీలంక ఏడో వికెట్ డౌన్

భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ వికెట్ల వేటను కొనసాగిస్తున్నాడు. ఆరో వికెట్ దక్కించుకున్నాడు. 12వ ఓవర్లో కుషాల్ మెండిస్‍ (17)ను ఔట్ చేశాడు సిరాజ్. దీంతో 11.2 ఓవర్లలో శ్రీలంక 33 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 

17 September 2023, 16:40 IST

10 ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్లకు 31 పరుగులు

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ విజృంభణతో కుప్పకూలిన శ్రీలంక కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. పది ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది లంక. దునిత్ వెల్లలాగే (6 పరుగులు నాటౌట్), కుషాల్ మెండిస్ (17 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. 

17 September 2023, 16:19 IST

సిరాజ్‍కు ఐదో వికెట్.. 12 రన్స్ వద్ద ఆరో వికెట్ కోల్పోయిన లంక 

శ్రీలంకతో ఆసియాకప్ 2023 ఫైనల్‍లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక(0)ను ఆరో ఓవర్లో బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‍లో ఐదో వికెట్ దక్కించుకున్నాడు. దీంతో 5.4 ఓవర్లలోనే 12 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది లంక. 

17 September 2023, 16:11 IST

ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. 12 పరుగులకే శ్రీలంక 5 వికెట్లు డౌన్

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్.. నాలుగో ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్ తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడో బంతికి సమరవిక్రమను, నాలుగో బంతికి అసలంకను, చివరి బంతికి ధనుంజయ డిసిల్వను ఔట్ చేశాడు సిరాజ్. దీంతో 4 ఓవర్లలో శ్రీలంక 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.  

17 September 2023, 16:06 IST

ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్

భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. నాలుగో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. నాలుగో ఓవర్ మూడో బంతికి చరిత్ అసలంకను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 8 పరుగుల వద్దే నాలుగో వికెట్‍ను కూడా కోల్పోయింది లంక. 

17 September 2023, 16:02 IST

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక

నాలుగో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు భారత పేసర్ సిరాజ్. సదీర సమవరిక్రమను ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 8 పరుగుల వద్దే శ్రీలంక మూడో వికెట్‍ను కోల్పోయింది 

17 September 2023, 15:57 IST

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక

నాలుగో ఓవర్ తొలి బంతికి శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంకను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. జడేజా మంచి క్యాచ్ పట్టాడు. దీంతో 8 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది శ్రీలంక. 

17 September 2023, 15:44 IST

తొలి ఓవర్లనే వికెట్ పడగొట్టిన బుమ్రా

భారత బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా.. తొలి ఓవర్ మూడో బంతికే శ్రీలంక ఓపెనర్ కుషాల్ పెరీర (0)ను ఔట్ చేశాడు. దీంతో 1 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది లంక. 

17 September 2023, 15:39 IST

మొదలైన మ్యాచ్.. బ్యాటింగ్‍కు దిగిన లంక

భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ మొదలైంది. వర్షం వల్ల మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. శ్రీలంక ఓపెరన్లు పాతుం నిస్సంక, కుషాల్ పెరీరా బ్యాటింగ్‍కు దిగారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తున్నాడు. 

17 September 2023, 15:21 IST

తగ్గిన వాన

కొలంబోలో వర్షం తగ్గింది. మైదానంపై కవర్లను తొలగిస్తున్నారు గ్రౌండ్ స్టాఫ్. మరికాసేపట్లో మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. 

17 September 2023, 15:05 IST

స్వల్ప వర్షం.. మ్యాచ్ ఆలస్యం..

టాస్ పడిన కాసేపటికే వాన మొదలైంది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆలస్యమవుతోంది.

17 September 2023, 14:40 IST

అక్షర్ స్థానంలో సుందర్.. భారత తుది జట్టు

ఆల్‍రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో భారత తుది జట్టులోకి వచ్చాడు వాషింగ్టన్ సుందర్. 

భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‍ప్రీత్ బుమ్రా, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ 

17 September 2023, 14:37 IST

శ్రీలంక తుదిజట్టు ఇదే

శ్రీలంక తుదిజట్టు: పతుమ్ నిస్సంక, కుషాల్ పెరీరా, కుషాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వ, దసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దసున్ హేమంత, ప్రమోద్ ముధషన్, మతీష పతిరణ

17 September 2023, 14:32 IST

IND vs SL Asia Cup Final Live Updates: టాస్ గెలిచిన శ్రీలంక.. బౌలింగ్‍కు దిగనున్న టీమిండియా

భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ షురూ అయింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. 

17 September 2023, 14:24 IST

పిచ్ రిపోర్ట్

ఈ మ్యాచ్ కోసం కొలంబో పిచ్ డ్రైగా ఉంది. క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయి. స్పిన్‍కు అనుకూలించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 

17 September 2023, 14:22 IST

కొలంబోలో కోహ్లీ అద్భుత రికార్డు

కొలంబోలో తాను ఆడిన చివరి ఐదు వన్డేల్లో భారత స్టార్ విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. మరి నేడు ఎలా ఆడతాడో చూడాలి. 

17 September 2023, 14:07 IST

సమయానికే మ్యాచ్

కొలంబోలో వాతావరణం మెరుగ్గా ఉంది. దీంతో భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ సమయానికే మొదలుకానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ పడనుండగా.. మ్యాచ్ 3 గంటలకు మొదలుకానుంది. 

17 September 2023, 13:43 IST

ఆసియాకప్ చరిత్రలో ఇండియాదే ఆధిపత్యం

టీమిండియా ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియాకప్‍ను కైవసం చేసుకుంది. ఆసియాకప్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‍గా ఉంది. నేడు శ్రీలంకతో జరిగే ఫైనల్‍లో గెలిస్తే.. భారత్ 8వ ఆసియాకప్ టైటిల్‍ను అందుకుంటుంది. కాగా, శ్రీలంక ఇప్పటి వరకు 6సార్లు ఆసియాకప్ టైటిల్ అందుకంది. 

17 September 2023, 13:15 IST

India vs Sri Lanka: పిచ్ ఇలా..

నేడు ఆసియాకప్ ఫైనల్ జరిగే కొలంబో ఆర్.ప్రేమదాస స్టేడియం పిచ్ స్లోగానే ఉండే ఛాన్స్ ఉంది. ఈ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. 

17 September 2023, 12:50 IST

రోహిత్‍కు 250వ వన్డే

భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ నేడు తన 250వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు.

17 September 2023, 12:27 IST

వర్షంపై అప్డేట్

ప్రస్తుతం కొలంబోలో వర్షం పడట్లేదు. మేఘాలు తొలగిపోయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మ్యాచ్ మధ్యలో వర్షం వచ్చినా.. రద్దు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వ్ డే ఉండనుంది. అది కూడా సాధ్యం కాకపోతే రెండు జట్లను (భారత్-శ్రీలంక) విజేతలుగా ప్రకటిస్తారు.

17 September 2023, 12:20 IST

కొలంబోలో మెరుగ్గా వాతావరణం

భారత్, శ్రీలంక మధ్య ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనున్న కొలంబోలో ప్రస్తుతం వాతావరణం మెరుగ్గానే ఉంది. వర్షం పడటం లేదు. ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ ఫైనల్ ఫైట్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది.

17 September 2023, 12:15 IST

శ్రీలంక టీమ్‍

శ్రీలంక తుదిజట్టులో దసున్ శనక (కెప్టెన్), కుషాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుషాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, మతీష పదిరణ, కసున్ రజిత్ 

17 September 2023, 11:28 IST

భారత జట్టు ఇదే!

వర్షం సంగతి ఎలా ఉన్నా ఆసియాకప్ ఫైనల్‍కు భారత తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్/ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ వాషింగ్టన్ సుందర్, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‍ప్రీత్ బుమ్రా ఉన్నట్లు అంచనా.

17 September 2023, 10:59 IST

మ్యాచ్ కష్టమే!

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే కొలంబోలో ఇవాళ మధ్యాహ్నానం 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు ఉరుములతో కూడిన వర్షం రానుందట. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా, శ్రీలంక మ్యాచ్ సజావుగా సాగడం కష్టమే అనిపిస్తోంది.

17 September 2023, 10:42 IST

వరుణుడి రాక

ఆసియా కప్ 2023లో ఇప్పటికే పలుమార్లు వర్షం పడి మ్యాచ్‍లకు అంతరాయం కలిగించింది. భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‍లోను వరుణుడు నేనున్నాంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొలంబో వాతావరణ శాఖ తెలిపింది.

17 September 2023, 10:24 IST

కొలంబో వేదికగా

ఆసియాకప్ 2023 టైటిల్ పోరులో చివరిగా తలపడేందుకు టీమిండియా, శ్రీలంక సంసిద్ధం అయ్యాయి. శ్రీలంకలోని కొలంబో వేదికగా నేడు (సెప్టెంబర్ 17) ఇండియా, లంక మధ్య తుది పోరు జరగనుంది. ఈ ఫైనల్ ఫైట్ మధ్యాహ్నాం మూడు గంటలకు మొదలు కానుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి