తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 1st T20: స‌ఫారీల‌తో పోరుకు సిద్ధ‌మైన‌ సూర్య‌కుమార్ సేన - నేడే తొలి టీ20 మ్యాచ్‌

IND vs SA 1st T20: స‌ఫారీల‌తో పోరుకు సిద్ధ‌మైన‌ సూర్య‌కుమార్ సేన - నేడే తొలి టీ20 మ్యాచ్‌

10 December 2023, 8:50 IST

  • IND vs SA 1st T20: టీమిండియా, సౌతాఫ్రికా మ‌ధ్య ఆదివారం (నేడు) డ‌ర్బ‌న్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ విన్న‌ర్స్ ఆస్ట్రేలియాను మ‌ట్టిక‌రిపించిన సూర్య‌కుమార్ సేన స‌ఫారీల‌పై ఆ జోరు కొనసాగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో నేటి మ్యాచ్‌లో బ‌రిలోకి దిగుతోంది.

టీమిండియా, సౌతాఫ్రికా
టీమిండియా, సౌతాఫ్రికా

టీమిండియా, సౌతాఫ్రికా

IND vs SA 1st T20: ఆదివారం (నేడు) టీమిండియా, సౌతాఫ్రికా మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది. డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రుగ‌నున్న ఈ మ్యాచ్‌తోనే టీ20 సిరీస్ మొద‌లుకానుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ విన్న‌ర్స్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన యంగ్ టీమ్ ఇండియా సౌతాఫ్రికాపై ఆ జోరును కొన‌సాగించాల‌ని ఊవ్విళ్లూరుతోంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విఫ‌ల‌మైన సూర్య‌కుమార్ యాద‌వ్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 Qualifier 1 KKR vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఈ ఐదుగురు ప్లేయర్సే కీలకం.. కేకేఆర్‌తో తొలి క్వాలిఫయర్ నేడే

Rohit Sharma vs Star Sports: ప్రైవసీ లేకుండా పోతుందన్న రోహిత్ ఆరోపణలపై స్టార్ స్పోర్ట్స్ రియాక్షన్ ఇదీ

MS Dhoni: ఐపీఎల్‍పై ధోనీ తుది నిర్ణయం తీసుకునేది అప్పుడే.. మేనేజ్‍మెంట్‍కు ఏం చెప్పాడంటే!

IPL 2024 Orange, Purple Cap: ఇక మిగిలింది ప్లేఆఫ్స్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఎవరు ఉన్నారంటే..

సార‌థిగా తొలి సిరీస్‌ను అందుకున్నాడు. సౌతాఫ్రికాతో నేడు జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ సూర్య‌కుమార్‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్‌ల‌పైనే బ్యాటింగ్ భారం ఎక్కువ‌గా ఉంది. ఇషాన్ కిష‌న్ స్థానంలో య‌శ‌స్వి జైస్వాల్‌ను ఓపెన‌ర్‌గా బ‌రిలో దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌కం కానున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ దిగి మెరుపులు మెరిపించాడు రింకు సింగ్‌.

సౌతాఫ్రికా సిరీస్‌లోనూ రింకు సింగ్ బ్యాట్ ఝులిపించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. తెలుగు ప్లేయ‌ర్ తిల‌క్ వ‌ర్మ‌కు కూడా తుది జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. పేస్ ద‌ళాన్ని సిరాజ్ న‌డిపించ‌బోతున్నాడు. అత‌డితో పాటు అర్ష‌దీప్‌, ముఖేష్ కుమార్‌ల‌కు ఛాన్స్ ద‌క్క‌నుంది.

స్పిన్‌ను ఎదుర్కోవ‌డంలో సౌతాఫ్రికాకు ఉన్న బ‌ల‌హీన‌త‌ను దృష్టిలో పెట్టుకొని ర‌వి బిష్టోయ్‌, కుల్దీప్ యాద‌వ్ ఇద్ద‌రిని తుది జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు స‌ఫారీ జ‌ట్టుకు మార్‌క్ర‌మ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. క్లాసెన్‌, మిల్ల‌ర్‌, స్ట‌బ్స్ వంటి హిట్ట‌ర్ల‌తో సౌతాఫ్రికా బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా క‌న‌బ‌డుతోంది. వారికి అడ్డుక‌ట్ట వేయ‌డంపైనే టీమిండియా విజ‌యావ‌కాశాలు ఆధాప‌డ్డాయి.

తదుపరి వ్యాసం