తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా

29 October 2023, 13:45 IST

    • IND vs ENG ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ జట్టు.
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా (REUTERS)

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా

IND vs ENG ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో ఇంగ్లండ్‍తో భారత్ పోరు షురూ అయింది. మెగాటోర్నీలో భాగంగా లక్నో వేదికగా నేడు (అక్టోబర్ 29) టీమిండియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‍కు దిగనుంది. న్యూజిలాండ్‍తో ఆడిన జట్టుతోనే టీమిండియా.. ఇంగ్లండ్‍తో ఈ మ్యా‍చ్‍కు బరిలోకి దిగుతోంది. తుది జట్టులో మార్పులు చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‍లో తమ జట్టు అదరగొడుతోందని, మధ్యలో బ్రేక్ రావడం ఎప్పుడైనా బాగానే ఉంటుందని హిట్‍మ్యాన్ చెప్పాడు. గత మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్టు చెప్పాడు. గత ఆదివారం న్యూజిలాండ్‍తో భారత్ ఆడింది. వారం విరామం తర్వాత నేడు ఇంగ్లండ్‍తో తలపడుతోంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍లు ఆడిన భారత్.. అన్నింటా గెలిచి అజేయంగా సత్తాచాటుతోంది. ఇంగ్లండ్‍పై ఈ మ్యాచ్ గెలిస్తే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. గాయంతో ఈ మ్యాచ్‍ కూడా దూరమయ్యాడు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు తాము స్థాయికి తగ్గట్టుగా ఆడలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అన్నాడు. తాము నేటి మ్యాచ్‍లో అదరగొట్టాలని పట్టుదలగా ఉన్నట్టు చెప్పాడు. పరువు కోసం ఆడుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍లు ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. నాలుగింట ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

కాగా, లక్నో పిచ్ నేడు స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. ఈ ప్రపంచకప్‍లో ఐదు మ్యాచ్‍ల్లోనూ చేజింగ్ చేసింది భారత్. అయితే, ఇంగ్లండ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసి.. టార్గెట్ సెట్ చేయనుంది.

భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ తుదిజట్టు: జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‍స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

తదుపరి వ్యాసం