తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 3rd Test: జ‌డేజా ఔట్ - నిల‌క‌డ‌గా ఆడుతోన్న ధ్రువ్ జురేల్‌, అశ్విన్

IND vs ENG 3rd Test: జ‌డేజా ఔట్ - నిల‌క‌డ‌గా ఆడుతోన్న ధ్రువ్ జురేల్‌, అశ్విన్

16 February 2024, 12:17 IST

  • IND vs ENG 3rd Test: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియా నిల‌క‌డ‌గా ఆడుతోంది. రెండో రోజు లంచ్ టైమ్ ముగిసేస‌రికి ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 388 ర‌న్స్ చేసింది.

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌
ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌

IND vs ENG 3rd Test: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతోన్న మూడో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. రెండో రోజు లంచ్ టైమ్‌కు టీమిండియా ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 388 ప‌రుగులు చేసింది. నాలుగు వంద‌ల వికెట్ల‌కు చేరువైంది. అరంగేట్ర వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురేల్ 31 ప‌రుగుల‌తో, అశ్విన్ 25 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఆరంభంలో నెమ్మ‌దిగా ఆడిన జురేల్ ఆ త‌ర్వాత స్పీడు పెంచాడు. అశ్విన్ కూడా క్రీజులో నిల‌దొక్కుకున్నాడు. టీమిండియా జోరు చూస్తుంటే 450 ప‌రుగులు దాటేలా క‌నిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

రెండు పరుగులు మాత్రమే...

326 పరుగులతో రెండో రోజు మొదలుపెట్టిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఐదు ప‌రుగులు మాత్ర‌మే జోడించి క‌ల్దీప్ యాద‌వ్‌, జ‌డేజా వికెట్ల‌ను కోల్పోయింది. టీమిండియా స్కోరు 331 వ‌ద్దే కుల్దీప్, జ‌డేపా పెవిలియ‌న్ చేరుకున్నాడు. తొలిరోజు సెంచ‌రీతో స‌త్తా చాటిన జ‌డేజా రెండో రోజు కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

జో రూట్ బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 112 ప‌రుగులు చేశాడు జ‌డేజా. క‌పిల్ దేవ్‌, అశ్విన్ త‌ర్వాత టెస్టుల్లో మూడు వేల‌కుపైగా ప‌రుగులు, రెండు వంద‌ల‌కు పైగా వికెట్లు తీసిన ఆట‌గాడిగా జ‌డేజా నిలిచాడు. మిడిల్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ దిగి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా కోహ్లి, రిష‌బ్ పంత్ రికార్డులు బ్రేక్ చేశాడు. కుల్దీప్ యాద‌వ్ నాలుగు ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

ఎనిమిదో వికెట్‌కు 57 ర‌న్స్‌...

మ‌రో వికెట్ ప‌డ‌కుండా ధ్రువ్ జురేల్‌, అశ్విన్ జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఎనిమిదో వికెట్‌కు వీరిద్ద‌రి జోడీ 57 ప‌రుగుల్ని జోడించింది. తొలి టెస్ట్‌లోనే ధ్రువ్ జురేల్ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అండ‌ర్స‌న్‌, మార్క్‌వుడ్ లాంటి దిగ్గ‌జ బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటూ క్రీజులో నిల‌దొక్కుకున్నాడు. చ‌క్క‌టి షాట్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అశ్విన్ కూడా అత‌డికి చ‌క్క‌టి స‌హ‌కారం అందించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అండ‌ర్స‌న్‌, హార్ట్‌లీ, రూట్‌కు త‌లో ఒక వికెట్ ద‌క్కింది.

32 ప‌రుగుల‌కే మూడు వికెట్లు...

మూడో టెస్ట్‌లో 32 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శ‌ర్మ, జ‌డేజా ఆదుకున్నారు. త‌న దూకుడైన ఆట‌కు భిన్నంగా క్రీజులో పాతుకుపోయిన రోహిత్ శ‌ర్మ 131 ప‌రుగులు చేశాడు. జ‌డేజా 112 ర‌న్స్ చేయ‌గా...మ‌రో అరంగేట్ర ప్లేయ‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 62 ప‌రుగుల‌తోరాణించాడు. రాజ్‌కోట్ టెస్ట్ ద్వారా స‌ర్ఫ‌రాజ్ కాన్‌, ధ్రువ్ జురేల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.

వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో విరాట్ కోహ్లి గాయాల కార‌ణంగా కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ దూరం కావ‌డంతో వారి స్థానంలో ధ్రువ్ జురేల్‌, స‌ర్ఫ‌రాజ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా , ఇంగ్లండ్ 1-1తో స‌మంగా ఉన్నాయి. హైద‌రాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్ విజ‌యం సాధించ‌గా వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా గెలుపొందింది.

తదుపరి వ్యాసం