తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే..

IND vs AUS: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే..

11 February 2024, 17:24 IST

    • IND vs AUS - Under 19 World Cup Final: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‍లో టీమిండియాకు ఆస్ట్రేలియా మోస్తరు టార్గెట్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‍ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు భారత యువ బౌలర్లు.
IND vs AUS: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన టీమిండియా
IND vs AUS: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన టీమిండియా (AFP)

IND vs AUS: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్: ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేసిన టీమిండియా

U19 World Cup Final - IND vs AUS: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‍లో భారత బౌలర్లు సమిష్టిగా రాణించి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను మోస్తరు స్కోరుకు కట్టడి చేశారు. టీమిండియా పేసర్ రాజ్ లింబానీ 10 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లతో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాలోని బెనోనీలో నేడు (ఫిబ్రవరి 11) జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‍లో ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్ హర్జాస్ సింగ్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఈ టైటిల్ పోరులో భారత్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

పేసర్ రాజ్ లింబానీ (3/37) రాణించటంతో ఆస్ట్రేలియాను కట్టడి చేయగలిగింది భారత్. టీమిండియా బౌలర్లలో నమన్ తివారీ రెండు, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్‍కు దిగిన ఆసీస్ 253 రన్స్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో భారత సంతతికి చెందిన హర్జాస్ సింగ్ (55) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ హ్యూజ్ వీబ్గెన్ (48), ఒలీవర్ పీక్ (48 నాటౌట్) రాణించారు.

అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‍ను ఆరోసారి కైవసం చేసుకోవాలంటే.. ఈ ఫైనల్ పోరులో భారత్ 254 పరుగులను ఛేదించాల్సి ఉంది. ఈ మ్యాచ్‍లో గెలిస్తే.. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‍లో అత్యధిక పరుగులను ఛేదించిన రికార్డు కూడా టీమిండియా ఖాతాలో చేరుతుంది. 

శుభారంభం చేసిన లింబానీ

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన ఆస్ట్రేలియాను భారత పేసర్ లింబానీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఆసీస్ ఓపెనర్ సామ్ కొన్‍స్టాట్ (0)ను బౌల్డ్ చేసి.. డకౌట్‍గా వెనక్కి పంపాడు. అయితే, ఆ తర్వాత మరో ఓపెనర్ హ్యారీ డిక్సాన్, కెప్టెన్ వీబ్గెన్ నిలకడగా ఆడారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే క్రమంగా పరుగులు రాబట్టారు. రెండు వికెట్‍కు 78 పరుగులు జోడించారు. అయితే, వీరిద్దరినీ వెనువెంటనే ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్‍త్రూలు ఇచ్చాడు బౌలర్ నమన్ తివారీ. 

రాణించిన భారత సంతతి ఆసీస్ బ్యాటర్

99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో హర్జాస్ సింగ్ ఆసీస్ జట్టును ఆదుకున్నాడు. హర్జాస్ సింగ్.. భారత సంతతికి చెందిన ప్లేయర్. వారి కుటుంబం 2000లో పంజాబ్ నుంచి సిడ్నీకి వెళ్లి స్థిరపడింది. 2005లో సిడ్నీలో జన్మించాడు హర్జాస్. దీంతో ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నాడు. 

మ్యాచ్ విషయానికి వస్తే.. హర్జాస్ సింగ్ నిలకడగా ఆడాడు. ర్యాన్ హిక్స్ (20) కాసేపు అతడికి తోడుగా నిలిచి ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ఒలీవర్ పీక్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన హర్జాస్ 59 బంతుల్లో అర్ధ శకతం చేశాడు. అయితే, కాసేపటికే అతడిని భారత స్పిన్నర్ సౌమీ పాండే ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. రాఫ్ మ్యాక్‍మిలాన్ (2), చార్జీ ఆండర్సన్ (13) వెనుదిరిగినా.. ఒలీవర్ పీక్ చివరి వరకు నిలిచాడు. 

డిఫెండింగ్ ఛాంపియన్‍గా బరిలోకి దిగిన భారత అండర్-19 జట్టు.. మరో టైటిల్ పట్టాలంటే 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి 

తదుపరి వ్యాసం