తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nz Vs Pak T20 : పాకిస్థాన్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టిన‌ ఫిన్ అలెన్ - 48 బాల్స్‌లో సెంచ‌రీ - 16 సిక్స్‌ల‌తో రికార్డ్‌

NZ vs PAK T20 : పాకిస్థాన్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టిన‌ ఫిన్ అలెన్ - 48 బాల్స్‌లో సెంచ‌రీ - 16 సిక్స్‌ల‌తో రికార్డ్‌

17 January 2024, 9:41 IST

  • NZ vs PAK T20 Match: బుధ‌వారం జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌల‌ర్ల‌కు న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ చుక్కులు చూపించాడు. 48 బాల్స్‌లోనే సెంచ‌రీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ 16 సిక్సులు కొట్టాడు.

ఫిన్ అలెన్
ఫిన్ అలెన్

ఫిన్ అలెన్

NZ vs PAK T20 Match: పాకిస్థాన్‌తో జ‌రిగిన‌ మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ ఆలెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 48 బాల్స్‌లోనే సెంచ‌రీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప‌ద‌హారు సిక్స‌ర్ల‌తో పాకిస్థాన్ బౌల‌ర్ల‌ను ఫిన్ అలెన్ చిత‌క్కొట్టాడు. మొత్తంగా ఈ టీ20 మ్యాచ్‌లో ఫిన్ అలెన్ 62 బాల్స్‌లో ప‌ద‌హారు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 137 ర‌న్స్ చేశాడు. ఫిన్ అలెన్ దెబ్బ‌కు న్యూజిలాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్‌ను ఛేదించ‌డంలో త‌డ‌బ‌డిన పాకిస్థాన్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 45 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

తొలి బాల్ నుంచే ఎదురుదాడి...

ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బాల్ నుంచి ఫిన్ అలెన్ పాక్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. హ‌రీస్ రౌఫ్ వేసిన ఓవ‌ర్‌లో మూడు సిక్స‌ర్లు, రెండు ఫోర్లు, ఓ సింగిల్‌తో అలెన్ 27 ర‌న్స్ చేశాడు. ఈ క్ర‌మంలో 48 బాల్స్‌లోనే అలెన్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా అత‌డి జోరు కొన‌సాగించింది.

అలెన్ జోరుతో ఓ ద‌శ‌లో న్యూజిలాండ్ 250 ప‌రుగులు దాటేలా క‌నిపించింది. అలెన్ దెబ్బ‌కు 16 ఓవ‌ర్ల‌లోనే న్యూజిలాండ్ స్కోరు 200 దాటింది. జ‌మాన్ ఖాన్ అత‌డిని ఔట్ చేసి పాక్‌కు ఊర‌ట‌నిచ్చాడు.. అలెన్ మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంతో న్యూజిలాండ్‌ 224 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అలెన్ త‌ర్వాత సీఫెర్ట్ 31 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అట

రికార్డులు బ్రేక్‌

ఈ మ్యాచ్‌తో ఫిన్ అలెన్ టీ20 క్రికెట్‌లో ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ త‌ర‌ఫున టీ20ల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో 123 ప‌రుగుల‌తో మెక్‌క‌ల‌మ్ టాప్ స్కోర‌ర్‌గా ఉన్నాడు.

పాకిస్థాన్ మ్యాచ్‌తో అత‌డి రికార్డును ఫిన్ అలెన్ అధిగ‌మించాడు. అంతే కాకుండా ఒకే టీ20 మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డును స‌మం చేశాడు. గ‌తంలో అప్ఘ‌నిస్థాన్ బ్యాట్స్‌మెన్ హ‌జ్ర‌తుల్లా జ‌జాయ్ ఓ టీ20 మ్యాచ్‌లో ప‌ద‌హారు సిక్స‌ర్లు కొట్టాడు. జ‌జాయ్ రికార్డును ఫిన్ అలెన్ స‌మం చేశాడు.

బాబ‌ర్ ఆజాం మిన‌హా...

225 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన పాకిస్థాన్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 179 ప‌రుగులు చేసింది. బాబ‌ర్ ఆజాం హాఫ్ సెంచ‌రీతో ఒంట‌రి పోరాటం చేశాడు. 37 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు ఓ సిక్స‌ర్‌తో 58 ర‌న్స్ చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి బాబ‌ర్‌కు స‌రైన స‌హ‌కారం ల‌భించ‌క‌పోవ‌డంతో పాక్ ఓట‌మి పాలైంది. న్యూజిలాండ్ సీనియ‌ర్ పేస‌ర్ టీమ్ సౌథీ రెండు వికెట్ల‌తో పాక్‌ను క‌ట్ట‌డి చేశాడు.

టీ20 సిరీస్ విజ‌యం

మూడో టీ20లో పాకిస్థాన్‌పై విజ‌యంతో 3-0 తేడాతో టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ కైవ‌సం చేసుకున్న‌ది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వ‌రుస‌గా మూడింటిలో న్యూజిలాండ్ విజ‌యాన్ని సాధించింది. హ్యాట్రిక్ ప‌రాభ‌వాల‌తో పాక్ డీలా ప‌డింది. నాలుగో టీ20 మ్యాచ్ శుక్ర‌వారం జ‌రుగ‌నుంది.

తదుపరి వ్యాసం