తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dc Vs Mi: ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపిన ఫ్రేజర్.. హోప్, పంత్, స్టబ్స్ మెరుపులు.. తన రికార్డు స్కోరు చేసిన ఢిల్లీ

DC vs MI: ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపిన ఫ్రేజర్.. హోప్, పంత్, స్టబ్స్ మెరుపులు.. తన రికార్డు స్కోరు చేసిన ఢిల్లీ

27 April 2024, 17:35 IST

  • DC vs MI IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఢిల్లీ బ్యాటర్లు కుమ్మేశారు. ముఖ్యంగా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ మెరుపు హిట్టింగ్‍తో చెలరేగాడు. 

DC vs MI: ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపిన ఫ్రేజర్.. హోప్, పంత్, స్టబ్స్ మెరుపులు.. తన రికార్డు స్కోరు చేసిన ఢిల్లీ
DC vs MI: ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపిన ఫ్రేజర్.. హోప్, పంత్, స్టబ్స్ మెరుపులు.. తన రికార్డు స్కోరు చేసిన ఢిల్లీ (ANI)

DC vs MI: ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపిన ఫ్రేజర్.. హోప్, పంత్, స్టబ్స్ మెరుపులు.. తన రికార్డు స్కోరు చేసిన ఢిల్లీ

DC vs MI IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో పరుగుల సునామీ కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధనాధన్ హిట్టింగ్‍తో భారీ స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్ (MI)తో నేటి మ్యాచ్‍లో ఢిల్లీ బ్యాటర్లు కలిసికట్టుగా కుమ్మేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

ఫ్రేజర్ విధ్వంసం

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఢిల్లీ ఓపెనర్, ఆస్ట్రేలియా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ మరోసారి రెచ్చిపోయాడు. ఎడాపెడా కళ్లు చెదిరే బౌండరీలతో ముంబై బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆరంభం నుంచే మెరుపు హిట్టింగ్‍తో చెలరేగాడు. 27 బంతుల్లోనే 84 పరుగులతో అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు మెక్‍గుర్క్. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో మోతమోగించాడు. దీంతో 6.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును ఢిల్లీ దాటేసింది. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేరాడు మెక్‍గుర్క్. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని రెండోసారి నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా కాసేపు మెరిపించాడు. అయితే, 8వ ఓవర్లో అతడిని ముంబై సీనియన్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఔట్ చేశాడు. నిదానంగా ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ పోరెల్ (27 బంతుల్లో 36 పరుగులు) పదో ఓవర్లో వెనుదిరిగాడు.

ఆ తర్వాత కూడా..

మెక్‍గుర్క్ తర్వాత ఢిల్లీ బ్యాటర్ షాయ్ హౌప్ దుమ్మురేపాడు. 17 బంతుల్లోనే 41 పరుగులతో మెరిపించాడు. ఒక్క ఫోర్ కొట్టకుండానే 5 సిక్స్‌లు కొట్టాడు. స్కోరు వేగం ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన మార్క్ షాట్లు ఆడి 19 బంతుల్లోనే 29 పరుగులు సాధించాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదేశాడు. పంత్ ఔటయ్యాక ట్రిస్టన్ స్టబ్స్ అదరగొట్టాడు. చివరి వరకు నిలిచాడు. 25 బంతుల్లోనే అజేయంగా 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు స్టబ్స్. ఢిల్లీ బ్యాటర్లను అడ్డుకోలేకోక ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సతమతమయ్యాడు.

బ్యాటర్లు సమిష్టిగా హిట్టింగ్‍తో దుమ్మురేపడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 రన్స్ చేసింది ఢిల్లీ. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ల్యూక్ వుడ్, జస్‍ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, మహమ్మద్ నబీ చెరో వికెట్ తీసుకున్నారు. ముంబై ముందు ఏకంగా 258 పరుగుల కొండంత టార్గెట్ నిలిచింది.

ఢిల్లీ రికార్డు స్కోరు

ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇది అత్యధిక స్కోరుగా ఉంది. 2011లో పంజాబ్ కింగ్స్‌పై చేసిన 231 పరుగులే ఢిల్లీకి ఇప్పటి వరకు ఐపీఎల్‍లో హయ్యెస్ట్ స్కోరుగా ఉండేది. అయితే, నేటి మ్యాచ్‍లో ముంబైపై 257 పరుగులు చేసింది ఢిల్లీ. దీంతో ఐపీఎల్‍లో తన అత్యధిక స్కోరు నమోదు చేసింది. 

తదుపరి వ్యాసం