తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner Cap: చివరి టెస్టుకు ముందు బ్యాగీ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న వార్నర్.. దొరికితే తెచ్చివ్వాలని విన్నపం

David Warner cap: చివరి టెస్టుకు ముందు బ్యాగీ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న వార్నర్.. దొరికితే తెచ్చివ్వాలని విన్నపం

Hari Prasad S HT Telugu

02 January 2024, 12:50 IST

    • David Warner cap: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో చివరి టెస్టు ఆడే ముందు తనకెంతో ఇష్టమైన బ్యాగీగ్రీన్ క్యాప్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తెచ్చి ఇవ్వండంటూ ఓ వీడియోలో వేడుకున్నాడు.
చివరి టెస్టుకు ముందు తన బ్యాగీ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న డేవిడ్ వార్నర్
చివరి టెస్టుకు ముందు తన బ్యాగీ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న డేవిడ్ వార్నర్ (AFP)

చివరి టెస్టుకు ముందు తన బ్యాగీ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న డేవిడ్ వార్నర్

David Warner cap: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో పాకిస్థాన్‌తో తన కెరీర్లోనే చివరి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఊహించని ఘటన జరిగింది. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ రావాల్సిన వార్నర్ బ్యాక్‌ప్యాక్ ఒకటి మిస్ అయింది. అందులో అతనికి ఎంతో ఇష్టమైన బ్యాగీ గ్రీన్ క్యాప్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

దీంతో తాను కోల్పోయిన బ్యాక్‌ప్యాక్ ఎవరికైనా దొరికితే దయచేసి తిరిగి ఇవ్వాలని కోరుతూ డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోలో పోస్ట్ చేశాడు. తన బ్యాక్‌ప్యాక్ తెచ్చి ఇచ్చిన వారికి మరో బ్యాక్‌ఫ్యాక్ గిఫ్ట్ గా ఇస్తానంటూ ఆ బ్యాగ్ ను వీడియోలో చూపించాడు. సిడ్నీలో బుధవారం (జనవరి 3) నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ చివరి టెస్ట్ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ తర్వాత వార్నర్ టెస్ట్, వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. తాను కోల్పోయిన బ్యాక్‌ప్యాక్ కోసం ఎంతో ప్రయత్నించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు వార్నర్ అందులో చెప్పాడు. "అందరికీ హాయ్. ఇది నా చివరి ప్రయత్నం. నా బ్యాగీ గ్రీన్ ఉన్న బ్యాక్‌ప్యాక్ ను నా లగేజీ నుంచి ఎవరో తీసుకున్నారు. కొన్నాళ్ల కిందట నా లగేజీని మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి పంపించారు. అది నాకు చాలా సెంటిమెంటల్.

నా చివరి టెస్ట్ ఆడటానికి వెళ్లే ముందు అది నా చేతుల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు నిజంగా బ్యాక్‌ప్యాకే కావాలనుకుంటే నా దగ్గర మరొకటి ఉంది. అది ఇస్తాను. మీకు ఎలాంటి సమస్య కూడా ఎదురవదు. దయచేసి క్రికెట్ ఆస్ట్రేలియా లేదంటే నా సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇవ్వండి. నా బ్యాగీ గ్రీన్ తిరిగిస్తే ఈ బ్యాక్ ప్యాక్ మీకిస్తా" అని వార్నర్ ఆ వీడియోలో చెప్పాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్స్ లగేజీని మోసుకెళ్లే కాంటాస్ ఎయిర్‌లైన్ తోపాటు మెల్‌బోర్న్ లో తాము బస చేసిన సౌత్‌బ్యాంక్ హోటల్ యాజమాన్యంతోనూ తాను మాట్లాడినట్లు వార్నర్ తెలిపాడు. పాకిస్థాన్ తో సిరీస్ కు ముందే తన చివరి టెస్ట్ సిరీస్ ఇదే అని వార్నర్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అనూహ్యంగా తన చివరి టెస్టుకు ముందు తాను వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైరవుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

తదుపరి వ్యాసం