తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner Century: చివరి టెస్టులో సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన డేవిడ్ వార్నర్

David Warner Century: చివరి టెస్టులో సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన డేవిడ్ వార్నర్

Hari Prasad S HT Telugu

14 December 2023, 12:46 IST

    • David Warner Century: కెరీర్లో ఆడుతున్న చివరి టెస్టులో సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. పాకిస్థాన్ తో గురువారం (డిసెంబర్ 14) ఆస్ట్రేలియా తొలి టెస్ట్ తొలి రోజు వార్నర్ సెంచరీ బాదడం విశేషం.
టెస్టుల్లో 26వ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్
టెస్టుల్లో 26వ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్ (AP)

టెస్టుల్లో 26వ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్

David Warner Century: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాను ఆడుతున్న చివరి టెస్ట్ లో సెంచరీ బాదాడు. పాకిస్థాన్ తో సిరీస్ లో తొలి టెస్టే వార్నర్ కు చివరి టెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత అతడు రిటైర్ కానున్నాడు. గురువారం (డిసెంబర్ 14) ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. తొలి రోజే మెరుపు సెంచరీ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

డేవిడ్ వార్నర్ కు చివరి టెస్ట్ ఆడే అవకాశం ఇచ్చి వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వడంపై సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే అతని విమర్శలకు వార్నర్ బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది తొలి సెంచరీ చేసిన వార్నర్ కు ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది 26వ సెంచరీ కావడం విశేషం.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వాళ్లలో విండీస్ లెజెండరీ బ్యాటర్ సర్ గ్యారీ సోబర్స్ రికార్డును వార్నర్ సమం చేశాడు. టెస్టుల్లో ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేని వార్నర్.. ఈ మ్యాచ్ కు చాలా ఒత్తిడిలో బరిలోకి దిగాడు. అయితే మొదటి నుంచీ తనదైన స్టైల్లో ధాటిగా ఆడిన వార్నర్ 125 బంతుల్లోనే 14 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ చేశాడు.

అంతేకాదు తొలి వికెట్ కు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి 126 రన్స్ జోడించాడు. ఖవాజా 41 రన్స్ చేసి ఔటయ్యాడు. తన చివరి టెస్టును అత్యుత్తమ ప్రదర్శనతో ముగించాలన్న కసితో వార్నర్ ఆడినట్లు కనిపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ అతని దూకుడు ఇదే స్పష్టం చేసింది. షహీన్ అఫ్రిది మినహాయించి అంతగా అనుభవం లేని పాకిస్థాన్ బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నాడు.

టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో వార్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు. గవాస్కర్ 33 సెంచరీలతో టాప్ లో ఉండగా.. అలిస్టర్ కుక్ 31, మాథ్యూ హేడెన్ 30, గ్రేమ్ స్మిత్ 27 సెంచరీలు చేశారు. వార్నర్ కు ఇది 26వ సెంచరీ.

తదుపరి వ్యాసం