తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sl Vs Ban: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. ఆరు ఓటముల తర్వాత గెలుపు

SL vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. ఆరు ఓటముల తర్వాత గెలుపు

06 November 2023, 22:18 IST

    • SL vs BAN World Cup 2023: ప్రపంచకప్‍లో శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఆల్‍రౌండ్‍ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లా.. ఈ టోర్నీలో ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.
నజ్ముల్ హుసేన్ శాంతో, షకీబల్ హసన్
నజ్ముల్ హుసేన్ శాంతో, షకీబల్ హసన్ (PTI)

నజ్ముల్ హుసేన్ శాంతో, షకీబల్ హసన్

SL vs BAN World Cup 2023: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో వరుసగా ఆరు ఓటముల తర్వాత బంగ్లాదేశ్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శ్రీలంకకు షాకిస్తూ విజయం సాధించింది. లంక మరో పరాభవం మూటగట్టుకుంది. ప్రపంచకప్‍లో భాగంగా ఢిల్లీ వేదికగా నేడు (నవంబర్ 6) జరిగిన మ్యాచ్‍లో బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. 53 బంతులను మిగిల్చి లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లా. దీంతో ఈ ప్రపంచకప్‍లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై కన్నేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ద్రవిడ్ తర్వాత అతడేనా?

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ చరిత్ అసలంక (108) శతకంతో సత్తాచాటగా.. సదీర సమరవిక్రమ (41), పాతుమ్ నిస్సంక (41) మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు, షకీబల్ హసన్, షఫియుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

లంక నిర్దేశించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సునాయసంగా ఛేదించింది. 41.1 ఓవర్లోనే 7 వికెట్లకు 282 పరుగులు చేసిన బంగ్లా విజయం సాధించింది. నజ్ముల్ హుసేన్ శాంతో (90) అద్భుతంగా ఆడినా.. కాస్తలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ (82) అర్ధ శతకంతో అదరగొట్టాడు. ఈ ఇద్దరి విజృంభణతో బంగ్లాకు గెలుపు దక్కింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంకకు మూడు, మహీశ్ తీక్షణ, అంజెలో మాథ్యూస్‍కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది లంక. చరిత్ అసలంక సెంచరీ సహా నిస్సంక, సమరవిక్రమ రాణిించటంతో ఓ దశలో లంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, ధనుంజయ డిసిల్వ (34) మినహా చివర్లో మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో 279 పరుగులకే లంక పరిమితమైంది. మరోవైపు, ఈ మ్యాచ్‍లో లంక సీనియర్ బ్యాటర్ అంజెలో మాథ్యూస్ (0).. టైమ్డ్ ఔట్ వివాదంగా మారుతోంది.

లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు తన్జీద్ హసన్ (9), లిటన్ దాస్ (23) ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత నజ్ముల్ హుసేన్ షాంతో, షకీబల్ హసన్ అదరగొట్టారు. అర్ధ శతకాలతో మెరిశారు. మూడో వికెట్‍కు 169 రన్స్ జోడించారు. వీరిద్దరూ ఔటయ్యాక బంగ్లా వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయినా.. బ్యాటర్లు తలాకొన్ని పరుగులు చేయటంతో బంగ్లాదేశ్ ఎట్టకేలకు గెలిచింది.

ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‍ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది శ్రీలంక. దీంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో మిగిలిన ఓ మ్యాచ్ గెలిచినా ఫలితం ఉండదు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్‍కు కూడా సెమీస్ అవకాశాలు లేవు. ఈ రెండు జట్లు ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఉన్నాయి.

తదుపరి వ్యాసం