తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Warner Retires: వ‌న్డేల‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్న‌ర్

Warner retires: వ‌న్డేల‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ వార్న‌ర్

Hari Prasad S HT Telugu

01 January 2024, 8:28 IST

  • Warner retires: ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ వ‌న్డేల‌కు గుడ్ బై చెప్పాడు. పాకిస్థాన్‌తో సిడ్నీలో జ‌ర‌గ‌బోయే టెస్టే త‌న కెరీర్లో చివ‌రిద‌ని గ‌తంలో చెప్పిన వార్న‌ర్‌.. ఆ మ్యాచ్ ప్రారంభానికి ముందే వ‌న్డేల‌కూ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

డేవిడ్ వార్న‌ర్
డేవిడ్ వార్న‌ర్ (PTI)

డేవిడ్ వార్న‌ర్

Warner retires: ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ వ‌న్డే క్రికెట్ నుంచి త‌ప్పుకున్నాడు. అయితే 2025లో జ‌ర‌గ‌బోయే ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మాత్రం అందుబాటులో ఉంటాన‌ని ప్ర‌క‌టించాడు. పాకిస్థాన్‌తో జ‌ర‌గ‌బోయే సిడ్నీ టెస్టే వార్న‌ర్ కెరీర్లో చివ‌రి టెస్ట్ కానుంది. ఇక ఇప్పుడు అత‌డు వ‌న్డే క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

ఇండియాలో వ‌రల్డ్‌క‌ప్ గెల‌వ‌డం త‌న కెరీర్లో గొప్ప ఘ‌న‌త అని వార్న‌ర్ ఈ సంద‌ర్భంగా చెప్పాడు. 'నేను వ‌న్డే క్రికెట్ నుంచి కూడా త‌ప్పుకుంటున్నాను. వ‌రల్డ్ కప్ స‌మయంలోనే ఈ విష‌యం చెప్పాను. ఆ వ‌రల్డ్‌క‌ప్ ఇండియాలో గెల‌వ‌డం చాలా గొప్ప ఘ‌న‌త' అని వార్న‌ర్ అన్నాడు.

పాకిస్థాన్‌తో చివ‌రి టెస్టు ఆడేందుకు ప్ర‌స్తుతం అత‌డు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నాడు. అక్క‌డే రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ వ‌న్డే రిటైర్మెంట్ గురించి అనౌన్స్ చేశాడు. ఆ నిర్ణ‌యం ఇవాళ తీసుకుంటున్నాను. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వివిధ లీగ్స్‌లో ఆడేందుకు నాకు అవ‌కాశం ఇచ్చే ఫార్మాట్ల నుంచి నేను రిటైర‌వుతున్నాను. ఛాంపియ‌న్స్ ట్రోఫీ వ‌స్తోంద‌ని నాకు తెలుసు. వ‌చ్చే రెండేళ్ల‌పాటు నేను బాగా ఆడుతుంటే, వాళ్ల‌కు ఎవ‌రైనా అవ‌స‌రం అయితే నేను అందుబాటులో ఉంటాను అని వార్న‌ర్ చెప్పాడు.

వ‌న్డేల్లో వార్న‌ర్ 22 సెంచ‌రీలు చేశాడు. 45.30 స‌గ‌టుతో 6932 ర‌న్స్ చేశాడు. వ‌న్డేల్లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో వార్న‌ర్ ఆరోస్థానంలో ఉన్నాడు. సెంచ‌రీల విష‌యానికి వ‌స్తే పాంటింగ్ (29 సెంచ‌రీలు) త‌ర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

అయితే వార్న‌ర్ కంటే పాంటింగ్ 205 ఇన్నింగ్స్ ఎక్కువ‌గా ఆడాడు. 2015లోనూ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లో వార్న‌ర్ స‌భ్యుడు. ఆ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున 345 ప‌రుగుల‌తో రెండో అత్య‌ధిక స్కోర‌ర్‌గా నిలిచాడు. 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియా త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్‌. అత‌డు 11 మ్యాచ్‌ల‌లో 535 ర‌న్స్ చేశాడు. రెండు సెంచ‌రీలు, రెండు హాఫ్ సెంచ‌రీలు చేయ‌డం విశేషం.

తదుపరి వ్యాసం