తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Aus Vs Nz World Cup: హెడ్ మెరుపు సెంచరీ.. అదరగొట్టిన వార్నర్, మ్యాక్సీ: ఆస్ట్రేలియా భారీ స్కోరు

AUS vs NZ World Cup: హెడ్ మెరుపు సెంచరీ.. అదరగొట్టిన వార్నర్, మ్యాక్సీ: ఆస్ట్రేలియా భారీ స్కోరు

28 October 2023, 14:26 IST

    • AUS vs NZ ODI World Cup 2023: న్యూజిలాండ్‍తో మ్యాచ్‍లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ట్రావిడ్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. చివర్లో మ్యాక్స్‌వెల్ మెరిపించాడు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.
AUS vs NZ World Cup: హెడ్ మెరుపు సెంచరీ.. అదరగొట్టిన వార్నర్, మ్యాక్సీ: ఆస్ట్రేలియా భారీ స్కోరు
AUS vs NZ World Cup: హెడ్ మెరుపు సెంచరీ.. అదరగొట్టిన వార్నర్, మ్యాక్సీ: ఆస్ట్రేలియా భారీ స్కోరు (AP)

AUS vs NZ World Cup: హెడ్ మెరుపు సెంచరీ.. అదరగొట్టిన వార్నర్, మ్యాక్సీ: ఆస్ట్రేలియా భారీ స్కోరు

AUS vs NZ ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో న్యూజిలాండ్‍తో మ్యాచ్‍లో ఆస్ట్రేలియా అదిరిపోయే స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67 బంతుల్లో 109 పరుగులు; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో చెలరేగడం సహా డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81 పరుగులు; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టాడు. దీంతో ధర్మశాల వేదికగా నేడు (అక్టోబర్ 28) న్యూజిలాండ్‍తో జరుగుతున్న మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగుల బంపర్ స్కోర్ చేసింది. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41 పరుగులు), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో 37 పరుగులు) మెరుపులు మెరిపించాడు. హెడ్, వార్నర్ దూకుడుతో ఓ దశలో 14.5 ఓవర్లలోనే 150 పరుగులు చేసిన ఆసీస్.. 400 పరుగులకు మించి చేసేలా కనిపించింది. అయితే, న్యూజిలాండ్ బౌలర్లు ఆ తర్వాత పుంజుకున్నారు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్, పేసర్ ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. మిచెల్ శాంట్నర్ రెండు, హెన్రీ నీషమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

LSG vs MI: చిట్ట‌చివ‌రి స్థానంతో ఇంటిముఖం ప‌ట్టిన ముంబై - ల‌క్నోను గెలిపించిన పూర‌న్‌, రాహుల్

MI vs LSG: దంచికొట్టిన పూరన్.. రాహుల్ హాఫ్ సెంచరీ.. ముంబై ఇండియన్స్‌పై లక్నో భారీ స్కోరు

Gambhir as Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బీసీసీఐ చూపు అతని వైపే..

హెడ్, వార్నర్ వీరబాదుడు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ బంపర్ స్టార్ట్ ఇచ్చారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగారు. ఆరంభం నుంచే న్యూజిలాండ్ పేసర్లను చితకబాదారు. టాప్ గేర్‌లో హిట్టింగ్ చేశారు. హెడ్, వార్నర్ జోరుతో 8.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరు 100 పరుగులకు చేరింది. 28 బంతుల్లో వార్నర్ అర్ధ శతకానికి చేరాడు. 25 బంతులకే హాఫ్ సెంచరీ చేశాడు హెడ్. ఆ తర్వాత కూడా ఇద్దరి జోరు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో 14.5 ఓవర్లలోనే ఆసీస్ స్కోరు 150 పరుగులకు చేరింది.

కళ్లెం వేసిన ఫిలిప్స్, శాంట్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్లు జోరుకు న్యూజిలాండ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ కళ్లెం వేశాడు. 20వ ఓవర్లో వార్నర్‌ను ఫిలిప్స్ ఔట్ చేశాడు. అలాగే, కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తన తొలి ప్రపంచకప్ మ్యాచ్‍లోనే సెంచరీతో హెడ్ అదరగొట్టాడు. 59 బంతుల్లోనే శతకానికి చేరాడు. అయితే, కాసేపటికే అతడిని కూడా ఫిలిప్ పెవిలియన్‍కు పంపాడు. సాంట్నర్ కూడా కట్టడి చేశాడు. దీంతో ఆస్ట్రేలియా పరుగుల వేగం క్రమంగా తగ్గిపోయింది. మిచెల్ మార్ష్ (36), స్టీవ్ స్మిత్ (18), మార్నస్ లబుషేన్ (18) వేగంగా పరుగులు చేయలేకపోయారు.  ఔటయ్యారు.

మ్యాక్సీ, కమిన్స్ మెరుపులు

పరుగులు మందగించడంతో ఆసీస్ ఇక కనీసం 350 పరుగులైనా చేయగలదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి తన హిట్టింగ్ పవర్ చూపాడు. వేగంగా ఆడాడు. బౌండరీలతో చెలరేగాడు. అయితే, 45వ ఓవర్లో ఔటయ్యాడు. ఇక చివర్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 14 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. జోస్ ఇంగ్లిస్ (38) నిలకడగా ఆడాడు. ఇక 49వ ఓవర్లో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఒకే పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ఆసీస్ 400 పరుగులకు చేరలేకపోయింది. చివరి ఓవర్లో స్టార్క్ కూడా ఔటవటంతో 388 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది. న్యూజిలాండ్ ముందు 389 పరుగుల భారీ లక్ష్యం ఉంది. 

తదుపరి వ్యాసం