తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Australia Vs Bangladesh: మార్ష్ భారీ శతకం.. బంగ్లాపై ఆస్ట్రేలియా ఘన విజయం.. పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‍లో..

Australia vs Bangladesh: మార్ష్ భారీ శతకం.. బంగ్లాపై ఆస్ట్రేలియా ఘన విజయం.. పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‍లో..

11 November 2023, 18:17 IST

    • Australia vs Bangladesh - ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్‍పై ఆస్ట్రేలియా గెలిచింది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‍లోనూ విజయం సాధించింది. 
మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్
మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (AP)

మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్

Australia vs Bangladesh - ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది ఆస్ట్రేలియా. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‍లో బంగ్లాదేశ్‍ను ఆసీస్ చిత్తుచేసింది. సెమీఫైనల్‍లో గెలుపు జోష్‍తోనే అడుగుపెట్టనుంది. వరల్డ్ కప్‍లో నేడు (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది. ఆసీస్ స్టార్ మిచెల్ మార్ష్ (132 బంతుల్లో 177 పరుగులు; నాటౌట్) అజేయ భారీ శతకంతో అదరగొట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

RCB Playoffs Chances: ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇలా గెలిస్తే టాప్ 4లోకి..

బంగ్లాదేశ్ ఇచ్చిన 307 పరుగులు లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 32 బంతులను మిగిల్చి మరీ ఛేదించింది. 44.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయిన 307 రన్స్ చేసి గెలిచింది. ఆసీస్ స్టార్ మార్ష్ అజేయ శతకంతో కదం తొక్కగా.. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (63 నాటౌట్) అర్ధ శకతం చేసి చివరి వరకు నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్‌కు చెరో వికెట్ దక్కింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 రన్స్ చేసింది. తౌహిద్ హ్రిదోయ్ (74) అర్ధ శతకం చేయగా.. నజ్ముల్ హుసేన్ శాంతో (45) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్, ఆడమ్ జంపా చెరో రెండు, మార్కస్ స్టొయినిస్ ఓ వికెట్ తీసుకున్నారు.

లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (10) త్వరగానే ఔటయ్యాడు. అయితే, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53) ఫామ్ కొనసాగిస్తూ అర్ధ శతకం బాదాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఔటయ్యాడు. అయితే, మిచెల్ మార్ష్ మాత్రం అదరగొట్టాడు. ఆరంభం నుంచే వేగంగా ఆడాడు. బౌండరీలతో చెలరేగాడు. అతడికి సీనియర్ స్టార్ స్టీవ్ స్మిత్ చివరి వరకు సహకరించాడు. 87 బంతుల్లోనే మిచెల్ మార్ష్ శతకం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు చూపాడు. మూడో వికెట్‍కు మార్ష్, స్మిత్ అజేయంగా 175 పరుగులు జోడించారు. చివరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను గెలిపించారు.

ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడిన ఆసీస్.. ఆ తర్వాత వరుసగా ఏడు మ్యాచ్‍లు గెలిచింది. 14 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. దక్షిణాఫ్రికా కూడా 14 పాయింట్లతోనే ఉన్నా.. ఆసీస్ కంటే నెట్‍రన్ రేట్ మెరుగ్గా ఉంది. బంగ్లాదేశ్ 9 మ్యాచ్‍ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచి.. నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

తదుపరి వ్యాసం