తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Allu Arjun Wishes Warner: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్

Allu Arjun wishes Warner: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్

Hari Prasad S HT Telugu

27 October 2023, 12:52 IST

    • Allu Arjun wishes Warner: డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పాడు. క్రికెట్ ఫీల్డ్ లో తరచూ పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకునే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ తో బన్నీకి మంచి రిలేషన్షిప్ ఏర్పడింది.
పుష్ప స్టైల్లో వార్నర్ బర్త్ డే సెలబ్రేషన్
పుష్ప స్టైల్లో వార్నర్ బర్త్ డే సెలబ్రేషన్

పుష్ప స్టైల్లో వార్నర్ బర్త్ డే సెలబ్రేషన్

Allu Arjun wishes Warner: డేవిడ్ వార్నర్ బర్త్ డే నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వార్నర్ ను బన్నీ విష్ చేశాడు. ఈ సందర్భంగా అతన్ని క్రికెట్ సూపర్ స్టార్ గా అర్జున్ అభివర్ణించడం విశేషం. శుక్రవారం (అక్టోబర్ 27) వార్నర్ తన 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

ప్రస్తుతం వరల్డ్ కప్ 2023లో డేవిడ్ వార్నర్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే పాకిస్థాన్, నెదర్లాండ్స్ లపై మెరుపు సెంచరీలు కూడా చేశాడు. వార్నర్ బర్త్ డే సందర్భంగా అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. "క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నాడు.

డేవిడ్ వార్నర్, అల్లు అర్జున్ మధ్య ప్రత్యేక బంధం ఉంది. సోషల్ మీడియా ద్వారా వీళ్లు తరచూ చాట్ చేసుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ బర్త్ డేనాడు కూడా డేవిడ్ వార్నర్ అతనికి విషెస్ చెప్పాడు. అది కూడా పుష్ప స్టైల్లో కావడం విశేషం. తన కూతురు ఐస్లా ఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ అని ఈ సందర్భంగా వార్నర్ చెప్పాడు.

ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ఆడుతున్న సమయంలో తెలుగు సినిమాలు, ఇక్కడి స్టార్లను అనుకరించడం మొదలుపెట్టాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ, అందులో బన్నీ మేనరిజం వార్నర్ కు తెగ నచ్చేసింది. అందుకే క్రికెట్ ఫీల్డ్ లో తరచూ పుష్ప స్టైల్ అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు.

ఈ మధ్యే వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ వార్నర్ మరోసారి పుష్ప స్టైల్ తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. అంతేకాదు ఈ మధ్యే పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలిచినప్పుడు కూడా వార్నర్ అతనికి విషెస్ పంపించాడు. కంగ్రాట్స్ అండ్ వెల్ డన్ అల్లు అర్జున్ అని వార్నర్ ఇన్‌స్టా స్టోరీలో రాశాడు.

తదుపరి వ్యాసం