తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar To Team India: ఇండియన్ టీమ్ నిర్దాక్షిణ్యంగా ఆడుతోంది.. ఊచకోత కోస్తోంది: షోయబ్ అక్తర్

Akhtar to team india: ఇండియన్ టీమ్ నిర్దాక్షిణ్యంగా ఆడుతోంది.. ఊచకోత కోస్తోంది: షోయబ్ అక్తర్

Hari Prasad S HT Telugu

03 November 2023, 16:49 IST

    • Akhtar to team india: ఇండియన్ టీమ్ నిర్దాక్షిణ్యంగా ఆడుతోంది.. భీకరమైన దాడితో ఊచకోత కోస్తోంది అంటూ పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. షమి, సిరాజ్, బుమ్రా బౌలింగ్ పై ప్రశంసలు కురిపించాడు.
షోయబ్ అక్తర్
షోయబ్ అక్తర్

షోయబ్ అక్తర్

Akhtar to team india: వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ నిర్దాక్షిణ్యంగా ఆడుతోందని, ప్రత్యర్థులమైన భీకరమైన దాడి చేస్తోందని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. శ్రీలంకను కేవలం 55 పరుగులకే చిత్తు చేసి 302 పరుగులతో గెలిచిన తర్వాత అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు. మీ ఫాస్ట్ బౌలర్లను చూసి గర్వించండి అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ను అతడు రిక్వెస్ట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ నిజానికి ప్రతి మ్యాచ్ కూ మెరుగవుతోంది. బుమ్రా, సిరాజ్, షమిలతో కూడిన పేస్ బౌలింగ్ త్రయం ప్రత్యర్థులను వణికిస్తోంది. శ్రీలంక బ్యాటర్లయితే.. అసలు క్రీజులో ఎదురునిలవడానికే భయపడ్డారు. ఇండియా ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ గెలవడంలో పేస్ బౌలర్లదీ కీలకమైన పాత్రే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు తన స్పీడుతో ప్రత్యర్థులను వణికించిన అక్తర్ ప్రశంసలు కురిపించాడు.

సెలబ్రేట్ చేసుకోండి

ఇండియా నిర్దాక్షిణ్యమైన జట్టుగా మారిపోయిందని అక్తర్ అనడం విశేషం. "ఇండియా నిర్దాక్షిణ్యమైన జట్టుగా మారుతోంది. ఇక నుంచి ఊచకోత ఇక ఆగదు. కానీ ఇండియన్స్ కు నా విన్నపం ఏంటంటే.. మీ పాస్ట్ బౌలర్లను చూసి గర్వించండి. ఎందుకంటే వాంఖడెలో వాళ్లు వేసిన ప్రతి బంతికీ స్టేడియమంతా మార్మోగిపోయింది" అని అక్తర్ అన్నాడు.

షమి, సిరాజ్, బుమ్రాలపై ప్రశంసలు కురిపించాడు. "షమి విషయంలో చాలా సంతోషంగా ఉంది. అతడు తన రిథమ్ మళ్లీ అందుకున్నాడు. మూడు మ్యాచ్ లలోనే ఇన్ని వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లలో 45 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా అయితే మరీ ప్రమాదకరంగా మారాడు. షమి, సిరాజ్ స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిందే బుమ్రా" అని అక్తర్ స్పష్టం చేశాడు.

వరల్డ్ కప్ 2023లో ఇండియా వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచి సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీలంకపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆసియా కప్ ఫైనల్లో ఆ టీమ్ ను కేవలం 50 పరుగులకే కుప్పకూల్చిన ఇండియన్ టీమ్.. తాజా మ్యాచ్ లోనూ 55 పరుగులకే కట్టడి చేసింది. ఇందులో షమి 5 వికెట్లు తీసుకొని.. మొత్తంగా 45 వికెట్లతో ఇండియా తరఫున వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.

తదుపరి వ్యాసం