తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌ రద్దు? వాయు కాలుష్యమే కారణం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌ రద్దు? వాయు కాలుష్యమే కారణం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

Sanjiv Kumar HT Telugu

04 November 2023, 10:14 IST

  • Delhi Pollution Effect To World Cup 2023: ఢిల్లీలోని వాయు కాలుష్యం వరల్డ్ కప్ 2023కి ఆటంకం కలిగించేలా ఉంది. దేశ రాజధానిలోని వాయు వాలుకాష్యం కారణంగా బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను నిలిపివేశారు.

వరల్డ్ కప్ మ్యాచ్‌ రద్దు? వాయు కాలుష్యమే కారణం.. డైరెక్టర్ ఏమన్నారంటే?
వరల్డ్ కప్ మ్యాచ్‌ రద్దు? వాయు కాలుష్యమే కారణం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

వరల్డ్ కప్ మ్యాచ్‌ రద్దు? వాయు కాలుష్యమే కారణం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

Bangladesh Vs Sri Lanka: దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం కారణంగా ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలోని వాయి కాలుష్యం కారణంగా బంగ్లాదేష్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేశారు. నవంబర్ 6న శ్రీలంకతో బంగ్లాదేశ్‌కు మ్యాచ్ ఉందని తెలిసిందే. దీనికోసం చేసే ప్రాక్టీస్ మ్యాచ్‌ను వాయు కాలుష్యం వల్ల రద్దు చేశారు. కోల్‌కతాలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ఓడిపోవడంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన బంగ్లా జట్టు ఢిల్లీకి చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

IPL 2024: కీలక సమయంలో ఐపీఎల్ జట్లకు ఇంగ్లండ్ ప్లేయర్ల షాక్.. వెళ్లిపోతున్న ఈ ఆటగాళ్లు.. రాజస్థాన్‍కు బైబై చెప్పిన బట్లర్

IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. 8 మ్యాచ్‌లు, 7 టీమ్స్, 3 బెర్తులు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

వాయు కాలుష్యం కారణంగా

శుక్రవారం (నవంబర్ 3) సాయంత్రం బంగ్లా టీమ్ మొదటి శిక్షణా సెషన్‌ను కలిగి ఉండాల్సి ఉంది. అయితే, అధిక కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని టీమ్ మేనేజ్‌మెంట్ దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఢిల్లీలో గాలి నాణ్యత అతి ప్రమాదక స్థాయిలో ఉంది. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేశారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగానే ఆటగాళ్ల శిక్షణ సెషన్‌ను రద్దు చేసేందుకు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అస్వస్థతకు గురికాకుండా

"ఇవాళ మాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. కానీ, నిన్నటి నుంచి వాయు కాలుష్యం పరిస్థితి విషమించింది. అలాగే మాకు శిక్షణ కోసం ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందుకు మేను ఛాన్స్ తీసుకోలేదు. చాలమంది క్రికెటర్లు నిన్న బయటకు వెళ్లారు. దాంతో వారు కాస్తా దగ్గు బారిన పడ్డారు. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉండటం, ఆటగాళ్లు అస్వస్థతకు గురికాకుండా ఉండేందుకు శిక్షణ రద్దు చేశాం" అని ఖలీద్ మహమూద్ వారు బస చేస్తున్న హోటల్ నుంచి వెల్లడించారు.

చాలా ముఖ్యమైనవి

"ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఆడాలా వద్దా. వాతావరణం మెరుగు అవుతుందా లేదా అనేది మాకు తెలియదు. వాతావరణం బాగుంటే కచ్చితంగా అది మాకు మంచిది. దానికి తగినట్లుగా పొందాలి. మా చేతిలో ఇంకా రెండు రోజులు ఉన్నాయి కాబట్టి ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రెండ్ మ్యాచ్‌లు మాకు చాలా ముఖ్యమైనవి" అని ఖలీద్ మహమూద్ పేర్కొన్నారు.

రద్దుపై బీసీసీఐ

ఇదిలా ఉంటే శుక్రవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (AQI-Air Quality Index) 468కి చేరుకుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని సివియర్ ప్లస్ కేటగిరీలో చేర్చారు. కాగా ఇదివరకు 2017లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వాయు కాలుష్యం కారణంగా.. శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాస్క్ ధరించాల్సి వచ్చింది. ఇక ఇలాగే వాయు కాలుష్యం కొనసాగితే నవంబర్ 6న ఢిల్లీలో జరిగే శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌ రద్దు చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై ఐసీసీ, బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

తదుపరి వ్యాసం