తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Gold: జొమాటో యూజర్లకు శుభవార్త

Zomato Gold: జొమాటో యూజర్లకు శుభవార్త

HT Telugu Desk HT Telugu

24 January 2023, 19:23 IST

  • Zomato Gold: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తన యూజర్లకు శుభవార్త తెలిపింది. గతంలో నిలిపేసిన జొమాటో గోల్డ్ (Zomato Gold) సౌకర్యాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.  

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

Zomato Gold: ఫుడ్ అగ్రిగేటర్ యాప్ జొమాటో మళ్లీ లాయల్టీ ప్రొగ్రామ్ ‘జొమాటో గోల్డ్ (Zomato Gold)’ను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ Zomato Gold ద్వారా యూజర్లు ప్రత్యేక డిస్కౌంట్లు, ఇతర సదుపాయాలు పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Zomato Gold: ఫ్రీ డెలివరీ..

మూడు నెలల ‘జొమాటో గోల్డ్ (Zomato Gold)’ సభ్యత్వాన్ని గతంలో ఉన్న రూ. 999 నుంచి తగ్గించి ఇప్పుడు రూ. 149 కే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మెంబర్ షిప్ ఉన్న యూజర్లు 10కిమీల దూరం లోపు ఫుడ్ డెలివరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ లాయల్టీ ప్రొగ్రాంతో 10 కిమీల లోపు అన్ లిమిటెడ్ డెలివరీలను ఉచితంగా పొందే అవకాశమంది. అలాగే, ముందు చెప్పిన సమయానికే డెలివరీ ఇచ్చే ‘నో డిలే గ్యారెంటీ డెలివరీ (no delay guarantee)’ సదుపాయం, రద్దీ సమయాల్లో వీఐపీ యాక్సెస్ (VIP access during rush hour) తదితర సదుపాయాలు లభిస్తాయి.

Zomato Gold: పేరు పాతదే కానీ..

యూజర్లు సులభంగా గుర్తించడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో పాత లాయల్టీ ప్రొగ్రామ్ పేరైన Zomato Gold ను కొనసాగిస్తున్నామే కానీ ఇది పూర్తిగా బ్రాండ్ న్యూ మెంబర్ షిప్ ప్రొగ్రామ్ అని జొమాటో((Zomato) సీఎఫ్ఓ అక్షంత్ గోయల్ వెల్లడించారు. జొమాటో ఎడిషన్ కార్డుతో జొమాటో ప్రొ (Zomato pro), లేదా జొమాటో ప్రొ (Zomato pro plus) ప్లస్ మెంబర్ షిప్ ఉన్నవారికి ఆ సదుపాయాలు ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతాయని, ఆ తరువాత జొమాటో గోల్డ్ మెంబర్ షిప్ ప్రారంభమవుతుందని వివరించారు. జొమాటో ప్రొ (Zomato pro) ను జొమాటో గత సంవత్సరం ఆగస్ట్ లో నిలిపేసింది.

Zomato Gold: పోటీ వల్ల తప్పడం లేదు..

ఈ లాయల్టీ ప్రొగ్రామ్ ల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని జొమాటో(Zomato) సీఎఫ్ఓ అక్షంత్ గోయల్ వ్యాఖ్యానించారు. కానీ, పోటీదారుల ప్రణాళికలకు అనుగుణంగా తాము కూడా సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. అందువల్లనే గతంలో నిలిపేసిన లాయల్టీ ప్రొగ్రామ్ ను మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే, 10 నిమిషాల్లో డెలివరీ ఇచ్చే జొమాటో ఇన్ స్టంట్ () ను త్వరలో రీబ్రాండింగ్ చేయనున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జొమాటో (Zomato) రూ. 250.8 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ. 434.9 కోట్లు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జొమాటో రూ. 1,661.3 కోట్ల ఆపరేటింగ్ ఆదాయాన్ని సమకూర్చుకుంది.

"

తదుపరి వ్యాసం