తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato's Pure Veg Mode: శాఖాహారులకు శుభవార్త; జొమాటోలో ఇక ప్యూర్ వెజ్ మోడ్; డెలివరీకి కూడా స్పెషల్ టీమ్స్

Zomato's pure veg mode: శాఖాహారులకు శుభవార్త; జొమాటోలో ఇక ప్యూర్ వెజ్ మోడ్; డెలివరీకి కూడా స్పెషల్ టీమ్స్

HT Telugu Desk HT Telugu

19 March 2024, 17:31 IST

  • Zomato: ప్యూర్ వెజిటేరియన్స్ కు శుభవార్త. వారు ఇకపై నాన్ వెజ్ తో మిక్స్ అవుతుందేమోనన్న భయం లేకుండా, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు, వాటిని డెలివరీ చేసే టీమ్ కూడా కేవలం వెజ్ ఆర్డర్స్ ను మాత్రమే డెలివరీ చేస్తుంది. అందుకోసం వారికి ప్రత్యేకంగా గ్రీన్ కలర్ బ్యాగ్స్ ను కూడా సమకూర్చారు.

జొమాటో గ్రీన్ డెలివరీ బాక్స్
జొమాటో గ్రీన్ డెలివరీ బాక్స్ (X/@deepigoyal)

జొమాటో గ్రీన్ డెలివరీ బాక్స్

Zomato's pure veg mode: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) లేటెస్ట్ గా తన యాప్ లో రెండు అప్ డేట్స్ ను చేసింది. కేవలం శాఖాహారం మాత్రమే తినేవారి కోసం ప్రత్యేకంగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ ను ప్రారంభించింది. ఇందులో కేవలం ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ వివరాలు మాత్రమే ఉంటాయి. అలాగే, ఈ ఆర్డర్స్ ను డెలివరీ చేయడం కోసం, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను డెలివరీ చేసే స్టాఫ్ ను ఉపయోగించబోరు. ఈ ప్యూర్ వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ను డెలివరీ చేయడం కోసం ప్రత్యేకంగా జొమాటో వెజ్ టీమ్ ను ఏర్పాటు చేశారు.

మార్చి 19 నుంచి..

మార్చి 19 నుంచి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందిస్తామని జొమాటో (Zomato) వెల్లడించింది. ఈ వివరాలను జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) లో వెల్లడించారు. 'ప్యూర్ వెజ్ మోడ్'తో పాటు 100 శాతం వెజిటేరియన్ ప్రాధాన్యత ఉన్న కస్టమర్ల కోసం జొమాటో (Zomato) లో 'ప్యూర్ వెజ్ ఫ్లీట్'ను ప్రారంభించామని ఆయన తెలిపారు. దశలవారీగా దేశవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జొమాటో ప్యూర్ వెజ్ మోడ్ స్వచ్ఛమైన శాఖాహార ఆహారాన్ని అందించే రెస్టారెంట్లను మాత్రమే లిస్ట్ ఔట్ చేస్తుందని, ఈ ఆర్డర్లను గ్రీన్ డెలివరీ బాక్సులను కలిగి ఉన్న ప్యూర్ వెజ్ ఫ్లీట్ ద్వారా డెలివరీ చేస్తామని ఆయన వివరించారు. ఈ గ్రీన్ డెలివరీ బాక్స్ ల్లో నాన్ వెజ్ హోటల్స్ నుంచి డెలివరీ అయ్యే వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను కూడా కలపబోమని స్పష్టం చేశారు.

నెటిజన్ల స్పందన

ఈ ట్వీట్ ను గంట క్రితం ఎక్స్ లో షేర్ చేశారు. నిమిషాల్లోనే ఇది 5వేలకు పైగా వ్యూస్ సాధించింది. దీనిపై శాఖాహార నెటిజన్లు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. "ధన్యవాదాలు, ఒకసారి నా వెజ్ ఫుడ్ లో చికెన్ వచ్చింది!" అని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. మరొకరు ‘‘నిజమే. శాకాహారులు కేవలం వెజిటేరియన్ రెస్టారెంట్ల నుండి మాత్రమే తినడం, ఆర్డర్ చేయడం చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. వారి ఫుడ్స్ ను ఎలా ప్రిపేర్ చేస్తారనేది వారికి అతిపెద్ద ఆందోళన. ప్రత్యేక పాత్రలు, నూనెలు వాడుతున్నారా లేదా? అన్న విషయాన్ని పట్టించుకుంటారు’’ అని మరో యూజర్ స్పందించారు. ‘‘ఇది మరొక యాప్ లా ఉంటుందా? లేక ప్రస్తుతం ఉన్న జొమాటో (Zomato) యాప్ లోనే ఈ వెజ్ మోడ్ ఉంటుందా?" అని మూడవ వ్యక్తి ప్రశ్నించాడు. ‘‘నేను 3-స్టార్ రిసార్ట్ లో పనిచేశాను. వంట ఎలా చేయాలో నాకు తెలుసు. శాకాహారంలో నాన్ వెజ్ వండిన నూనెను ఉపయోగించడం చాలా సాధారణం’’ అని మరో వ్యక్తి వెల్లడించారు.

తదుపరి వ్యాసం