తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Ceo : రూ. 4.59 కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కొన్న జొమాటో సీఈఓ!

Zomato CEO : రూ. 4.59 కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కొన్న జొమాటో సీఈఓ!

Sharath Chitturi HT Telugu

17 March 2024, 13:23 IST

    • Deepinder Goyal Aston Martin DB12 :  జొమాటో సీఈఓ లగ్జరీ కార్ల జాబితాలో ఆస్టన్​ మార్టిన్​ డీబీ12 చేరింది. ఈ కారు ధర రూ. 4.59 కోట్లు!
జొమాటో సీఈఓ లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త వెహికిల్​!
జొమాటో సీఈఓ లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త వెహికిల్​! (Instagram/Automobili Ardent)

జొమాటో సీఈఓ లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త వెహికిల్​!

Aston Martin DB12 : సూపర్​ లగ్జరీ ఆస్టన్​ మార్టిన్​ డీబీ12ని.. గతేడాది ఇండియాలో లాంచ్​ చేసింది బ్రిటీష్​కి చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఇప్పుడు ఈ వెహికిల్​ డెలివరీని మొదలుపెట్టింది. ఇండియాలో.. తొలి ఆస్టన్​ మార్టిన్​ డీబీ12ని కొన్నారు.. జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్​ గోయల్​. ఇండియాలో.. ఆస్టన్ మార్టిన్ డీబీ12 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.4.59 కోట్లుగా ఉంది.

ఆస్టన్ మార్టిన్ డీబీ12.. ఒక బ్రిటిష్ గ్రాండ్ టూరర్. మెర్సిడెస్-ఏఎంజీలోని 4.0-లీటర్ ట్విన్-టర్బో వీ 8 ఇంజిన్.. ఈ లగ్జరీ కారులో ఉంటుంది. ఇది.. 671 బీహెచ్​పీ పవర్​ని, 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో.. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఉంటుంది.. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం.. 3.5 సెకన్లలో అందుకుంటుంది. అయితే.. టాప్ స్పీడ్ మాత్రం 325 కేఎంపీహెచ్​కి లిమిట్​ చేయడం జరిగింది.

Aston Martin DB12 price in India : ఈ ఆస్టన్​ మార్టిన్​ డీబీ12.. డీబీ11కి సక్సెసర్​గా వస్తోంది. 80 శాతం కొత్తది. భారీ కొత్త గ్రిల్, త్రీ-పీస్ డీఆర్ఎల్ యూనిట్​తో రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, మరింత అగ్రెసివ్​ లుక్ కోసం షార్ప్​ స్టైల్​ బంపర్​ సహా ప్రధాన డిజైన్ మార్పును ఈ కొత్త కారులో చూడొచ్చు. చూడంగానే.. ఇది ఆస్టన్​ మార్టిన్​ కారు అని చెప్పేసే విధంగా.. ఈ వెహికిల్ ​ఉంటుంది.

కొత్త డ్యూయెల్-టోన్ లెథర్ అప్​హోలిస్ట్రీ, డాష్​బోర్డ్​ సహా డీబీ11తో పోల్చుకుంటే.. కొత్త కారు కేబిన్​లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, అన్ని అవసరమైన కంట్రోల్స్​ కోసం ఫిజికల్ బటన్ల హోస్ట్ ఉంది. అయితే ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ ఇప్పుడు డిజిటల్​గా కూడా ఉంది. కొత్త డీబీ12 గ్రాండ్ టూరర్ కాబట్టి, సౌకర్యానికి అధిక ప్రాధాన్యత ఉంది. స్పోర్ట్స్ కారు రైడ్ నాణ్యతలో లోపం లేకుండా హ్యాండ్లింగ్​ని ఆప్టిమైజ్ చేయడం కోస ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్, అడాప్టివ్ డాంపర్లతో వస్తుంది.

జొమాటో సీఈఓ గోయల్​ గ్యారేజ్​లో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఫెరారీ రోమా, లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫాంటే, పోర్షే 911 టర్బో ఎస్, ఆస్టన్ మార్టిన్ డీబీ11 ఏఎంఆర్, మెర్సిడెస్-ఏఎంజీ జీ 63, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటివి కొన్ని ఉదాహరణలు.

తదుపరి వ్యాసం