తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Byd Seal: భారత్ లో ప్రారంభమైన బీవైడీ సీల్ లగ్జరీ కార్ బుకింగ్స్; ధర ఎంతంటే..?

BYD Seal: భారత్ లో ప్రారంభమైన బీవైడీ సీల్ లగ్జరీ కార్ బుకింగ్స్; ధర ఎంతంటే..?

05 March 2024, 21:09 IST

BYD Seal: కొత్త బీవైడీ సీల్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ బుకింగ్స్ భారత్ లో ప్రారంభమయ్యాయి. బీవైడీ నుండి వచ్చిన మూడవ మోడల్ ఇది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో హ్యుందాయ్ అయోనిక్ 5, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ, బిఎమ్ డబ్ల్యూ ఐ4 మొదలైన వాటికి ఇది గట్టి పోటీ ఇస్తుంది. 

  • BYD Seal: కొత్త బీవైడీ సీల్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ బుకింగ్స్ భారత్ లో ప్రారంభమయ్యాయి. బీవైడీ నుండి వచ్చిన మూడవ మోడల్ ఇది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో హ్యుందాయ్ అయోనిక్ 5, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ, బిఎమ్ డబ్ల్యూ ఐ4 మొదలైన వాటికి ఇది గట్టి పోటీ ఇస్తుంది. 
బివైడి సీల్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.
(1 / 9)

బివైడి సీల్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఇది లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ గా మార్కెట్లోకి వస్తుంది. భారతదేశంలో  బీవైడీ నుంచి వచ్చిన మూడవ కార్ ఇది.
(2 / 9)

డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో బీవైడీ సీల్  లభిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ లో ఇది లభిస్తుంది.
(3 / 9)

బీవైడీ సీల్ సొగసైన బాడీ డిజైన్, స్లోయింగ్ రూఫ్ లైన్ తో ఆకర్షణీయంగా ఉంది. హెడ్ ల్యాంప్ లు, టెయిల్ లైట్ లు రెండింటినీ మధ్యలో ఉన్న LED బార్ ల ద్వారా కనెక్ట్ చేశారు.
(4 / 9)

బీవైడీ సీల్ లో లెదర్ అప్ హోల్ స్టరీ, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ రొటేటింగ్ 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, రెండు వైర్ లెస్ ఛార్జర్లు,  పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 
(5 / 9)

బివైడి సీల్ రెండు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. 61.44 కిలోవాట్ల ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కిలోమీటర్లు వస్తుంది. 82.56 కిలోవాట్ల ప్యాక్ 650 కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. 61.44 కిలోవాట్ల ప్యాక్ మోడల్ 201 బీహెచ్ పీ, 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, 82.56 కిలోవాట్ల ప్యాక్ మోడల్ 308 బీహెచ్పీ, 360 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండూ వెనుక చక్రాలకు శక్తిని పంపుతాయి. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 523 బీహెచ్ పీ పవర్. 670 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 
(6 / 9)

బీవైడీ సీల్  స్టాండర్డ్ ఏడీఏఎస్ తో వస్తుంది.
(7 / 9)
బీవైడీ సీల్  స్టాండర్డ్ ఏడీఏఎస్ తో వస్తుంది.
బీవైడీ సీల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బీవైడీ ఆథరైజ్డ్ సెంటర్లలో రూ. 1.25 లక్షలు చెల్లించి ఈ సెడాన్ ను బుక్ చేసుకోవచ్చు. 
(8 / 9)

బీవైడీ సీల్ ధరల శ్రేణి రూ. 41 లక్షల నుంచి ప్రారంభమై రూ. 53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి