తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: వాట్సాప్ నుంచి మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్; ఇక సెర్చ్ చేయడం మరింత సులువు..

WhatsApp: వాట్సాప్ నుంచి మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్; ఇక సెర్చ్ చేయడం మరింత సులువు..

HT Telugu Desk HT Telugu

29 February 2024, 17:08 IST

  • WhatsApp new feature: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ను, ఫీచర్స్ ను వాట్సాప్ తీసుకువస్తుంటుంది. తాజాగా, మరో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ తో ఇకపై పాత వాట్సాప్ మెసేజెస్ ను మరింత సులువుగా సెర్చ్ చేయవచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్ సెర్చ్ బై డేట్
వాట్సాప్ కొత్త ఫీచర్ సెర్చ్ బై డేట్ (unsplash)

వాట్సాప్ కొత్త ఫీచర్ సెర్చ్ బై డేట్

WhatsApp search-by-date feature: యూజర్లకు మరింత సౌకర్యవంతమైన చాట్ అనుభవాన్ని అందించేందుకు వాట్సాప్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంటుంది.అందులో భాగంగానే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇప్పుడు, సెర్చ్ చేయడాన్ని మరింత సులభతరం చేయడానికి మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది.

సెర్చ్-బై-డేట్ ఫీచర్

వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తాజాగా ‘‘సెర్చ్-బై-డేట్’’ (search-by-date) అనే కొత్త ఫీచర్ ను ప్రకటించారు. ఇది వినియోగదారులకు నిర్దిష్ట తేదీల ఆధారంగా మెసేజెస్ ను సెర్చ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ విధంగా వినియోగదారులు గతంలో తాము పంపిన లేదా తమకు వచ్చిన ముఖ్యమైన సమాచారాన్ని సులువుగా తిరిగి పొందగలరు. సాధారణంగా సెర్చ్ బై వర్డ్ విధానం వల్ల అవసరం లేని సెర్చ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కానీ సెర్చ్ బై డేట్ విధానంలో ఆ రోజు వచ్చిన మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి.

మార్క్ జుకర్ బర్గ్ వీడియో

మార్క్ జుకర్ బర్గ్ తన అధికారిక వాట్సాప్ ఛానెల్ లో సెర్చ్ బై డేట్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ ఒక పోస్ట్ ను షేర్ చేశారు. డేట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తాను పాత చాట్ ను ఎలా కనుగొన్నానో ఆ వీడియో పోస్ట్ లో పంచుకున్నాడు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, సెర్చ్-బై-డేట్ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజెస్, ఐఓఎస్, మాక్, వాట్సాప్ వెబ్ లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా లింక్స్, మీడియా, డాక్యుమెంట్స్ వంటి వాటిని డేట్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు. మెసేజ్ పంపిన లేదా వచ్చిన తేదీని గుర్తుంచుకుంటే చాలు, వారు ఆ రోజు వచ్చిన గ్రూప్ చాట్స్ లేదా పర్సనల్ చాట్స్ ను సులభంగా కనుగొనవచ్చు.

సెర్చ్ బై డేట్ ఇలా పని చేస్తుంది..

వాట్సాప్ (WhatsApp search-by-date feature) లో సెర్చ్-బై-డేట్ ఫీచర్ ను ఉపయోగించడానికి..

  • ముందుగా ఏదైనా వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ను తెరవండి
  • ఎగువ కుడి మూలలో మీకు మూడు చుక్కలు కనిపిస్తాయి. దానిపై ట్యాప్ చేసి "సెర్చ్" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • తరువాత కుడివైపున, మీకు కొత్త క్యాలెండర్ చిహ్నం కనిపిస్తుంది. ఆ క్యాలెండర్ లో మీరు ఏ తేదీ నాటి మెసేజ్, లేదా ఫొటో, లేదా డాక్యుమెంట్ కావాలో గుర్తించాలి.
  • ‘చాట్ ఫిల్టర్స్’, ‘ఫేవరెట్స్’ ఫీచర్ల సహకారంతో స్టార్ మెసేజెస్ ను త్వరగా గుర్తించేలా వాట్సాప్ చూస్తుంది.

తదుపరి వ్యాసం