తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi: యూపీఐ ద్వారా ఇక ఏటీఎంలలో నగదు డిపాజిట్ కూడా చేయొచ్చు; ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

UPI: యూపీఐ ద్వారా ఇక ఏటీఎంలలో నగదు డిపాజిట్ కూడా చేయొచ్చు; ఎలాగో ఇక్కడ తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

05 April 2024, 16:51 IST

  • ఏటీఎంలలో నగదు జమ చేసేందుకు యూపీఐ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు డెబిట్ కార్డ్ ను ఉపయోగించి, ఏటీఎంలలో నగదును క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా డిపాజిట్ చేసేవారు. ఇకపై యూపీఐ ఐడీ తో కూడా ఏటీఎంలలో క్యాష్ ను డిపాజిట్ చేయవచ్చు. 

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (PTI)

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

మీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ఐడీ ద్వారా ఇకపై బ్యాంకు ఏటీఎంలలో నగదును డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటు (REPO RATE)ను యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ ఐడీ (UPI id) తో ఎటీఎం లలో నగదును డిపాజిట్ చేసే సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సదుపాయానికి సంబంధించిన కార్యాచరణ సూచనలు త్వరలో విడుదల చేయనున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

యూపీఐ తో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా

యూపీఐ ఐడీ తో, కార్డ్ అవసరం లేకుండానే, ఏటీఎం (ATM) ల నుంచి నగదును విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ప్రారంభించాయి. ఆ విధానం ద్వారా నేర్చుకున్న పాఠాల నుంచి యూపీఐ ద్వారా ఏటీఎంలలో నగదును జమ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో (CDM) నగదు డిపాజిట్ చేయడానికి చాలా మంది వినియోగదారులు డెబిట్ కార్డు (Debit card) లను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘సీడీఎంలు నగదును హ్యాండిల్ చేయడంలో బ్యాంక్ ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాయి. దాంతో, బ్యాంక్ ల్లో పొడవైన క్యూలను నివారించడం సాధ్యమైంది’’ అని వివరించారు.

యూపీఐ ఐడీ తో ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలి?

యూపీఐ ఐడీతో ఏటీఎంలలో క్యాష్ ను విత్ డ్రా చేసుకునే సదుపాయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఆ విధానంలో ఎలాంటి స్టెప్స్ ఫాలో అవుతామో, దాదాపు, అలాంటి స్టెప్స్ ను ఉపయోగించే, ఏటీఎం లోనే నగదును డిపాజిట్ చేయవచ్చు. ఆ స్టెప్స్ ఈ కింది విధంగా ఉండవచ్చు.

  • ఏటీఎం మెషీన్ స్క్రీన్ పై కనిపించే ఆప్షన్ల లో 'యూపీఐ కార్డ్ లెస్ క్యాష్' ని సెలెక్ట్ చేయాలి.
  • అప్పుడు కార్డు రహిత డిపాజిట్ ప్రక్రియను ప్రారంభించాలి. మీరు డిపాజిట్ చేయదలుచుకున్న మొత్తాన్ని ఎంచుకోవాలి.
  • తర్వాతి దశలో ఏటీఎం మెషీన్ స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను మీ స్మార్ట్ ఫోన్ లోని యూపీఐ యాప్ తో స్కాన్ చేయాలి.
  • ఆ తర్వాత యూపీఐ ఏటీఎం డిపాజిట్ ను ధృవీకరించడానికి మీ యూపీఐ పిన్ తో ధృవీకరించాలి.
  • అయితే, ఈ విధానానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ సూచనలు త్వరలో విడుదల చేయనున్నారు.

తదుపరి వ్యాసం