తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : నేటిబంగారం ధరలు ఇవే….

Gold and silver Price Today : నేటిబంగారం ధరలు ఇవే….

HT Telugu Desk HT Telugu

31 October 2022, 6:47 IST

    • Gold and silver Price Today దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. మార్కెట్లలో పరుగులు తీస్తున్న పసిడి ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరట నిచ్చాయి. గ్రాము బంగారంపై గత వారంతో పోలిస్తే రూ.300కు పైగా తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు స్థిరంగా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా రోజువారీ ధరల పెరుగుదల నమోదవుతున్నా కొనుగోళ్ళు మాత్రం  తగ్గు ముఖం పట్టడం లేదు. 
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా.. (REUTERS)

మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

Today Gold and Silver Price దేశంలో గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త దిగివస్తున్నాయి. గ్రాము బంగారంపై రూ.380 తగ్గుదల నమోదైంది. దేశీయంగా అన్ని ప్రధాన బులియన్ మార్కెట్లలో బంగారం ధరల్లో తగ్గుదల నమోదవుతోంది. సగటున గ్రాముపై రూ.300పైగా తగ్గుదల నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Today Gold and Silver Price దేశంలో బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర ఢిల్లీలో రూ. 46,900గా ఉంది. శనివారంతో పోలిస్తే బంగారం ధర రూ.350 తగ్గింది. ఢిల్లీలో గ్రాము బంగారం ధర రూ.4,690గా ఉంది. హైదరాబాద్‌ మార్కెట్లో గ్రాము బంగారం ధర రూ.4675గా ఉంది. గత వారం ముగింపుతో పోలిస్తే రూ.350 తగ్గుదల నమోదైంది.

Gold rate today : దేశంలో బంగారం ధరల్లో ఆదివారం స్వల్పంగా తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ బులియన్ మార్కెట్లలో గ్రాము బంగారం ధర రూ.4675గా ఉంది. పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750గా నమోదైంది. శనివారం స్థానిక మార్కెట్లలో ఈ ధర రూ.51వేలుగా ఉంది. దాదాపు రూ.380 రుపాయల తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌, విజయవాడ బులియన్‌ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51వేలుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.4675గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51వేలుగా ఉంది. గత శనివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధర రూ.350తగ్గింది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 47,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర గ్రాము రూ.4690గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. ఆదివారం పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250గా ఉంది. శనివారం మార్కెట్లతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర రూ.350 తగ్గుదల నమోదైంది. బెంగుళూరులో గ్రాము బంగారం ధర రూ.4680గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. గత వారం ముగింపులో రూ.47,150గా ఉన్న ధర రూ.350 మేర తగ్గింది. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్‌ కిలో వెండి ధఱ రూ.63వేలుగా ఉంది. చెన్నైలో రూ.63వేలు, ముంబైలో రూ.57,500,ఢిల్లీలో రూ.57,500, అహ్మదాబాద్‌లో రూ.57,500,విజయవాడలో రూ.63వేలుగా వెండి ధర ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం