తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposit Interest Rate : ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది!

Fixed deposit interest rate : ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది!

Sharath Chitturi HT Telugu

23 February 2024, 6:53 IST

  • Unity Small Finance Bank FD rates : ఎఫ్​డీల్లో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే.. ఈ బ్యాంక్​ని చెక్​ చేయండి. ఇక్కడ 9శాతం వరకు వడ్డీ లభిస్తోంది!

ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది!
ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది! (iStock)

ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది!

Unity Small Finance Bank : భారతదేశానికి అత్యంత ఇష్టమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి.. ఫిక్స్​డ్ డిపాజిట్​ (ఎఫ్​డీ). జీరో రిస్క్​తో.. గ్యారంటీ రాబడి హామీ ఇవ్వడం, పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందించడంతో పాటు ఎఫ్​డీలు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా తీసుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా రేట్లు అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిల్లో యూనిటీ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​ ఒకటి. ఈ బ్యాంక్​.. ఎఫ్​డీలపై 9శాతం వరకు వడ్డీని ఇస్తోంది!

యూనిటీ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో వడ్డీ రేట్లు..

పెద్ద బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక రేట్లను లభిస్తాయి. ఇక యూనిటీ ఫైనాన్స్​ బ్యాంక్​.. సాధారణ వినియోగదారులకు 4.5% నుంచి 9% మధ్యలో వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ డిపాజిట్ వడ్డీ రేట్లు.. 2024 ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. 1001 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 9 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.10,000 డిపాజిట్ మొత్తంతో మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

వడ్డీ రేట్లు ఇలా..

6 నెలలు - 201 రోజులు- 8.75%

501 రోజులు- 8.75%

Unity Small Finance Bank FD rates in Telugu : 701 రోజులు- 8.95%

1001 రోజులు- 9 %

1002 రోజులు - 3 సంవత్సరాలు- 8.15%

3 సంవత్సరాలు - 5 సంవత్సరాలు- 8.15%

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్​లో ఎఫ్​డీ రకాలు..

  • రెగ్యులర్ ఎఫ్​డీ
  • షార్ట్ టర్మ్ & లాంగ్ టర్మ్ ఎఫ్​డీ
  • రీ-ఇన్వెస్ట్మెంట్

అయితే.. ఇతర బ్యాంక్​లతో పోల్చుకుంటే.. స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లలో రిస్క్​ కాస్త ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​..

HDFC bank FD rates : దిగ్గజ బ్యాంకింగ్​ సంస్థ.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఫిబ్రవరి 9 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి హెచ్​డీఎఫ్​సీ ఫిక్స్​డ్​ డిపాజిట్లలో, మీరు మీ డబ్బును 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అన్ని కాలపరిమితులలో 0.50% అదనపు వడ్డీ రేటు లభిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు..

ICICI bank FD rates : ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​లో సంవత్సరానికి 3.00% నుంచి 7.20% వరకు వడ్డీ రేట్లు లభిస్తుంది. ఈ పథకం కాలపరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.

తదుపరి వ్యాసం