తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Finance Fd : 8.8శాతం వడ్డీ ఇచ్చే ఎఫ్​డీ కావాలా? ఇదిగో..!

Bajaj Finance FD : 8.8శాతం వడ్డీ ఇచ్చే ఎఫ్​డీ కావాలా? ఇదిగో..!

Sharath Chitturi HT Telugu

04 January 2024, 11:10 IST

    • Bajaj Finance FD : అత్యధిక వడ్డీ రేటుతో కూడిన ఎఫ్​డీల కోసం వెతుకున్నారా? మీ అన్వేషణకు తెరపడింది. బజాజ్​ ఫైనాన్స్​లో ఆకర్షణీయమైన వడ్డీకి ఎఫ్​డీ పొందొచ్చు.
8.8శాతం వడ్డీ ఇచ్చే ఎఫ్​డీ కావాలా? ఇదిగో..!
8.8శాతం వడ్డీ ఇచ్చే ఎఫ్​డీ కావాలా? ఇదిగో..!

8.8శాతం వడ్డీ ఇచ్చే ఎఫ్​డీ కావాలా? ఇదిగో..!

Bajaj Finance FD : దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్‪సర్వ్​లో భాగమైన బజాజ్ ఫైనాన్స్​ లిమిటెడ్​.. ఫిక్స్‪డ్ డిపాజిట్​(ఎఫ్‪డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్, వెబ్‪సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85శాతం వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తున్నట్టు వెల్లడించింది.‬‬‬‬‬‬‬

ట్రెండింగ్ వార్తలు

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

ఆకర్షణీయమైన వడ్డీతో ఎఫ్​డీ..

నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా, డిపాజిట్లని బుక్ చేయడానికి డిజిటల్, అసిస్టెడ్ డిజిటల్ పద్ధతిని ఉపయోగించేలా ఖాతాదారులను ప్రోత్సహించడం ద్వారా సేవింగ్స్​ అనుభవాన్ని ఈ డిజిటల్ ఎఫ్‪డీ కొత్తగా రూపుదిద్దుతుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్, వెబ్‪సైట్​లో.. చాలా సులభంగా, సురక్షితంగా, ఏ ఇబ్బందులు లేకుండా, దాదాపు తక్షణం ఎఫ్‪డీ బుక్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬‬‬

Bajaj Finance fixed deposit interest rate : 2024 జనవరి 2 నుంచి, బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్​, వెబ్‪సైట్ ద్వారా 42 నెలల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్‪డీలకు సీనియర్ సిటిజెన్లయితే బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ వడ్డీని ఇస్తుంది. 60ఏళ్లల్లోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ వడ్డీ పొందవచ్చు. కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరయిన డిపాజిట్లని.. 42 నెలల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ పథకంలో గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬

"ఇబ్బందులు లేని విధానక్రమాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఖాతాదారు అనుకూల విధానాలు, బజాజ్ ఫిన్‪సెర్వ్ ఎఫ్‪డీలతో ఖాతాదారుల అనుభవాన్ని నిర్వచిస్తాయి. గత రెండేళ్లలో 2 రెట్లు పెరిగిన మా డిపాజిట్ బుక్, ఖాతాదారులు బజాజ్ బ్రాండ్​పై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. మా ఎఫ్‪డీలు ఇప్పుడు డిపాజిట్​దారులు డిజిటల్-ఫస్ట్​గా ఆలోచించే వీలుకల్పిస్తుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్​, వెబ్‪సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన అధిక వడ్డీ రేట్లతో, ఎటువంటి ఇబ్బందులూ వుండవు. చాలా సులభమైన ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రయాణంగా దీన్ని రూపొందించాము. ఇది ఎఫ్‪డీ తెరిచే అనుభవాన్ని డిజిటల్ కాలంలోకి తీసుకువస్తోంది" అని బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‪డ్ డిపాజిట్లు అండ్​ ఇన్వెస్ట్‪మెంట్ట్స్ హెడ్ సచిన్ సిక్కా అన్నారు.‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬‬

Highest FD interest rates : 2023 సెప్టెంబర్ 30 నాటికి.. బజాజ్ ఫైనాన్స్​కి 76.56 మిలియన్ ఖాతాదారులు, 44.68 మిలియన్ నెట్ యూజర్లు ఉన్నారు. డాటా.ఐఓ నివేదిక ప్రకారం.. ప్లేస్టోర్​లోని ఫైనాన్షియల్ డొమైన్​లలో, భారతదేశంలో బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్, అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న 4వ యాప్​గా నిలిచింది.‬‬

2023 సెప్టెంబర్ 30 నాటికి, రూ. 54,821 కోట్లకుపైగా మొత్తం డిపాజిట్ బుక్, 1.4 మిలియన్ డిపాజిట్లతో, ఈ కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్‪బిఎఫ్‪సీగా అవతరించింది. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‪డ్ డిపాజిట్ కార్యక్రమం, క్రిసిల్ వారి ఏఏఏ/స్టేబుల్, ఐసీఆర్ఏ వారి ఏఏఏ (స్టేబుల్) అత్యధిక రేటింగ్స్ సాధించి, మదుపుదారులకు అత్యంత సురక్షితమైన పెట్టుబడుల అవకాశాలని అందించేదిగా నిలుస్తోంది.‬‬‬‬‬‬

తదుపరి వ్యాసం