42k crore of unclaimed deposits: మన బ్యాంకుల్లో రూ. 42 వేల కోట్ల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు.. అవన్నీ ఏమవుతాయి..?-over rs 42k crore of unclaimed deposits in indian banks amount rises by 28 percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  42k Crore Of Unclaimed Deposits: మన బ్యాంకుల్లో రూ. 42 వేల కోట్ల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు.. అవన్నీ ఏమవుతాయి..?

42k crore of unclaimed deposits: మన బ్యాంకుల్లో రూ. 42 వేల కోట్ల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు.. అవన్నీ ఏమవుతాయి..?

HT Telugu Desk HT Telugu
Dec 19, 2023 08:24 PM IST

42k crore of unclaimed deposits: 2023 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు 28% పెరిగాయి. భారత్ లోని బ్యాంకుల్లో ఇప్పుడు రూ. 42 వేల కోట్లకు పైగా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Getty Images/iStockphoto)

42k crore of unclaimed deposits: భారతీయ బ్యాంకుల్లో ఇప్పటివరకు ఎవరూ క్లెయిమ్ చేయని (unclaimed deposits) మొత్తం రూ. 42,272 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 28% పెరిగింది.

అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్వచనం ప్రకారం.. గత 10 సంవత్సరాలుగా ఏదైనా ప్రైవేటు బ్యాంకులో, లేదా, ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ లేకుండా, సంబంధిత ఖాతాదారు నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఉన్న మొత్తాన్ని అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ (unclaimed deposits) గా పేర్కొంటారు. లేదా, మెచ్యూరిటీ పూర్తయి 10 ఏళ్లు దాటినా క్లెయిమ్ చేసకోని డిపాజిట్లను కూడా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు (unclaimed deposits) గా పేర్కొంటారు. 2023 మార్చి చివరి నాటికి, భారతీయ బ్యాంకుల్లో ఈ తరహా డిపాజిట్లు రూ. 42, 272 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 36,185 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, రూ. 6,087 కోట్లు ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. 2022, మార్చి చివరి నాటికి భారతీయ బ్యాంకుల్లో ఉన్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ రూ. 32, 934 కోట్లు.

రిజర్వ్ బ్యాంక్ కు వెళ్తాయి..

ఇలా పదేళ్లుగా అన్ క్లెయిమ్డ్ గా ఉన్న డిపాజిట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ (Depositor Education and Awareness Fund) కు వెళ్తాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. సాధారణంగా, అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఆయా బ్యాంకులు తమ వెబ్ సైట్లలో డిస్ ప్లే చేయాలి. ఆయా ఖాతాదారులు, లేదా వారి వారసుల వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే, ఇలాంటి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను అర్హులైన యజమానులకు అందజేయడం కోసం ఆర్బీఐ (RBI) అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్ వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (Unclaimed Deposits Gateway to Access Information UDGAM) అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను కూడా ప్రారంభించింది.

Whats_app_banner