తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Festival Gift: ఈ పండుగ సీజన్ లో మీ భార్య కు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే.. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు..

Festival gift: ఈ పండుగ సీజన్ లో మీ భార్య కు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే.. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు..

HT Telugu Desk HT Telugu

01 November 2023, 10:42 IST

  • Best Festival gift to your spouse: దసరా, దీపావళి పండుగ సీజన్ కొనసాగుతోంది. ఈ పండుగ సీజన్ లో మీ జీవిత భాగస్వామికి జీవితాంతం గుర్తుంచుకునే అద్భుతమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా?.. అలా అయితే, ఈ గిఫ్ట్స్ బెస్ట్..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

ప్రతీకాత్మక చిత్రం

Best Festival gift to your spouse: పండుగ సీజన్ నడుస్తోంది. దీపావళి సందర్భంగా జీవిత భాగస్వామికి గుర్తుండిపోయే గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఈ పండుగకు భవిష్యత్తులో గొప్పగా ఉపయోగపడే ఈ గిఫ్ట్స్ ను ఇచ్చే విషయం పరిశీలించండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

Facebook, Instagram down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్; నెటిజన్స్ ఫైర్..

Trading guide: ఈ రోజు ఈ స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ అని నిపుణుల సూచన

Mutual Funds: మ్యుచ్యువల్ ఫండ్స్

ఈ పండుగకు మ్యూచువల్ ఫండ్‌ ను మీ భార్యకు బహుమతిగా ఇవ్వండి. SIP విధానంలో మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ విధానంగా మారింది. మ్యుచ్యువల్ ఫండ్స్ కు మార్కెట్ అస్థిరత నుంచి రక్షణ ఉంటుంది. మీరు మీ భార్య పేరు మీద చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. చిన్న మొత్తమైనా సిప్ చేయడం ప్రారంభించండి. వీటిలో ఇక్విటీస్ ఫండ్స్ నుంచి డెట్ ఫండ్స్ వరకు వివిధ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.

Real estate: రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్ అనేది సురక్షితమైన పెట్టుబడి విధానం. దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ ను అందిస్తాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో భాగంగా.. ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ తీసుకోవచ్చు. లేదా ఏదైనా నమ్మకమైన వెంచర్ లో ఈఎంఐ విధానంలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Gold: బంగారం

స్త్రీలకు అత్యంత ఇష్టమైన బంగారాన్ని ఈ పండుగ సీజన్ లో గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. నిజానికి ఇది అత్యంత సురక్షితమైన, మంచి వృద్ధికి అవకాశమున్న పెట్టుబడి సాధనం. బంగారాన్ని నేరుగా ఆభరణంగా కానీ, డిజిటల్ గా కానీ, గోల్డ్ ఈటీఎఫ్ ల రూపంలో కానీ, సావరిన్ గోల్డ్ బాండ్ ల రూపంలో కానీ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ప్రముఖ జ్యువెలరీ షాప్స్ నెలవారీ పెట్టుబడితో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

Stocks: స్టాక్స్

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు కొంత రిస్క్ తో కూడుకున్నవైనా, మంచి రిటర్న్స్ ను ఇచ్చే ఇన్వెస్ట్ మెంట్స్. మార్కెట్ పై అవగాహన పెంచుకుని, మంచి ఫండమెంటల్స్ ఉన్న సంస్థల స్టాక్స్ ను మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే, ముందుగా మార్కెట్ పై అవగాహన, స్టాక్స్ గురించి, వాటి మూవ్ మెంట్ గురించి అధ్యయనం అవసరం. సిప్ ఇన్వెస్ట్మెంట్స్ (SIP investments) ద్వారా కూడా స్టాక్స్ ను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ప్రతీ నెల కొంత మొత్తాన్ని స్టాక్స్ కొనుగోలుకు వినియోగించవచ్చు.

Term Insurance: టర్మ్ ఇన్స్యూరెన్స్

ఒకవేళ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చే వ్యక్తి అకాల మరణం చెందితే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా టర్మ్ ఇన్స్యూరెన్స్ కాపాడుతుంది. ఇది పిల్లల విద్య, వివాహం, ఇతర రుణాల చెల్లింపు వంటివాటికి ఉపయోగపడ్తుంది.

Health insurance: ఆరోగ్య బీమా

వైద్యం ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఏదైనా అనారోగ్యం తలెత్తితే, చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అందువల్ల, ప్రతీ వ్యక్తి ఆరోగ్య బీమా తీసుకుని ఉండాలి. ఈ పండుగ సందర్భంగా మీకు, మీ జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా తీసుకోండి. ఇది మీ అత్యుత్తమ గిఫ్ట్ అవుతుంది.

తదుపరి వ్యాసం