తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio New Year Offer : న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది చూడండి..

Jio New Year offer : న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది చూడండి..

Sharath Chitturi HT Telugu

24 December 2023, 13:45 IST

    • Jio New Year 2024 offer : న్యూ ఇయర్​ వేళ.. సరికొత్త ఆఫర్​తో వచ్చేసింది రిలయన్స్​ జియో. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది!
న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది!

న్యూ ఇయర్​ వేళ జియో అదిరిపోయే ఆఫర్​- మీకు యూజ్​ అవుతుంది!

Jio New Year 2024 offer : దేశంలోనే లీడింగ్​ టెలికాం సంస్థ రిలయన్స్​ జియో.. మరో కొత్త ఆఫర్​తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది! నూతన ఏడాది నేపథ్యంలో.. జియో ప్రీపెయిడ్​ సబ్​స్క్రైబర్స్​కి 'న్యూ ఇయర్​ 2024' ఆఫర్​ని తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

జియో న్యూ ఇయర్​ 2024 ఆఫర్​ వివరాలు..

రిలయన్స్​ జియో రూ. 2999 ప్లాన్​పై కొత్త ఆఫర్​ని ప్రకటించింది సంస్థ. సాధారణంగా.. ఈ ప్లాన్​లో 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. కానీ.. జియో న్యూ ఇయర్​ 2024 ఆఫర్​తో.. వాలిడిటీ అనేది మరో 24 రోజులు పెరుగుతుంది. అంటే.. రూ. 2999 ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకుంటే, ప్లాన్​ వాలిడిటీ 389 రోజులుగా ఉంటుంది! అంటే.. రోజుకు 7.70 ఖర్చు అవుతున్నట్టు అర్థం.

Jio New Year 2024 offer details : ఈ జియో 2999 ప్లాన్​తో రోజుకు 2.5జీబీ డేటా వస్తుంది. మొత్తం మీద 912.5జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా.. అన్​లిమిటెడ్​ వాయిస్​ కాల్స్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు సైతం ఈ ప్లాన్​లో భాగం.

ఇక ఈ జియో 2999 ప్లాన్​తో జియో టీవీతోపాటు జియోసినిమా, జియోక్లౌడ్​ వంటివి అదనంగా పొందొచ్చు! ఇక అన్​లిమిటెడ్​ 5జీ డేటా కూడా ఈ ప్లాన్​తో లభిస్తుంది.

Jio prepaid plans full details : అయితే.. ఈ రూ. 2999 ప్లాన్​ అనేది అందరికి ఉపయోగపడకపోవచ్చు! ప్రతి రోజు.. ఎక్కువ డేటా వాడేవారికి ఇది సరిగ్గా నప్పుతుంది. మిగిలిన వారు మరింత అఫార్డిబుల్​, తక్కువ డేటా ప్లాన్​లను ఎంచుకోవచ్చు.

ఈ ఆఫర్​ ఎప్పుడు ముగుస్తుందో సంస్థ చెప్పలేదు. కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండొచ్చు!

4 ఓటీటీలు ఒకే ప్లాన్‌తో..!

JioTV Premium Plans : జియో టీవీ ప్రీమియం ప్లాన్స్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఒకే ప్లాన్ తో ఏకంగా 14 ఓటీటీలను అందిస్తుండటం విశేషం. కొన్ని రోజుల క్రితమే.. ఈ ప్లాన్స్​ని జియో లాంచ్ చేసింది. దీంతోపాటు మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అనౌన్స్ చేయడం విశేషం. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం