తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi 13c Launch : ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Redmi 13C launch : ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Sharath Chitturi HT Telugu

28 November 2023, 13:03 IST

    • Redmi 13C : ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఈ మోడల్​ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ అయ్యింది.
ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!
ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

ఇండియాలో రెడ్​మీ 13సీ లాంచ్​ డేట్​ ఫిక్స్​..!

Redmi 13C launch date in India : ఇండియా మార్కెట్​లో సరికొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది షావోమీ సంస్థ. ఈ గ్యాడ్జెట్​ పేరు రెడ్​మీ 13సీ. ఈ మోడల్​ని ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ చేసిన ప్రముఖ టెక్​ సంస్థ.. ఇండియాలోకి డిసెంబర్​ 6న తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​తో పాటు ధరకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Facebook, Instagram down: ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్; నెటిజన్స్ ఫైర్..

Trading guide: ఈ రోజు ఈ స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ అని నిపుణుల సూచన

రెడ్​మీ 13సీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ ఇవే..!

అంతర్జాతీయ మార్కెట్​లో లాంచ్​ చేసిన రెడ్​మీ 13సీలో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.74 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​ లభిస్తుంది.

ఇక ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో, ఆక్సిలరీ లెన్స్​లతో కూడిన ట్రిపుర్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఫ్రెంట్​లో 8ఎంపీ కెమెరా లభిస్తోంది. వీటిని చూస్తుంటే.. ఇది పక్కా బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని స్పష్టమవుతోంది.

Redmi 13C price : ఇక ఈ రెడ్​మీ 13సీలో 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ వయర్డ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​, టైప్​-సీ పోర్ట్​ వంటివి ఉంటాయి. ఈ మొబైల్​.. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న గ్యాడ్జెట్​లో మీడియాటెక్​ హీలియో జీ99 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. రెండు కలర ఆప్షన్స్​ ఇందులో ఉండొచ్చట. అవి.. స్టార్​డస్ట్​ బ్లాక్​, స్టార్​ షైన్​ గ్రీన్​.

ఇదీ చూడండి:- Redmi Watch 4 : సూపర్​ లుక్​తో రెడ్​మీ వాచ్​ 4.. త్వరలోనే లాంచ్​!

రెడ్​మీ 13సీ ధర ఎంతంటే..!

Redmi 13C price in India : అంతర్జాతీయ మార్కెట్​లో ఇటీవలే లాంచ్​ అయిన రెడ్​మీ 13సీలో 3 వేరియంట్స్​ ఉన్నాయి. అవి 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​. వీటి ధరలు వరుసగా.. సుమారు రూ. 11,700- రూ. 13,350- రూ. 13,770గా ఉన్నాయి.

ఇండియాలో ఎన్ని వేరియంట్స్​ లాంచ్​ అవుతాయి? అన్నది చూడాలి. ధరలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉండొచ్చు. పూర్తి వివరాలు.. లాంచ్​ టైమ్​ సమీపిస్తున్నప్పుడు బయటకు వస్తాయి. సరైన ప్రైజ్​ పాయింట్​లో లాంచ్​ చేస్తే.. ఈ రెడ్​మీ 13సీ గ్యాడ్జెట్​కు.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో మంచి డిమాండ్​ ఉంటుందని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తదుపరి వ్యాసం