తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Major State Economies: జీడీపీ వృద్ధిలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడో తెలుసా?

Major state economies: జీడీపీ వృద్ధిలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu

03 December 2022, 21:45 IST

    • Major state economies: జీడీపీ వృద్ధిని పరిగణనలోకి తీసుకుని వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉండడం విశేషం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Major state economies: స్థిర ధరల వద్ద రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి(Gross state domestic product at constant price-GSDP)లో వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా, చివరి స్థానంలో కేరళ ఉండడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

Major state economies: తొలి స్థానంలో గుజరాత్

దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుజరాత్ నిలిచింది. 2021 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ GSDP రూ. 12.48 లక్షల కోట్లు. ఇది 2012 ఆర్థిక సంవత్సరంలో రూ. 6.16 లక్షల కోట్లు మాత్రమే. మొత్తంగా గుజరాత్ సీఏజీఆర్(compounded annual growth rate -CAGR) 8.2%గా ఉంది. జీడీపీ మొత్తం పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంటుంది. 2021 సంవత్సరంలో మహారాష్ట్ర GSDP రూ. 18.89 లక్షల కోట్లు.

Major state economies: తరువాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు

2) కర్నాటక: జీడీపీ వృద్ధిలో కర్నాటక రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్ర సీఏజీఆర్(CAGR) 7.3% గా ఉంది. కర్నాటక జీఎస్ డీపీ(GSDP) 2012లో రూ. 6.06 లక్షల కోట్లు కాగా, 2021లో అది రూ. 11.44 లక్షల కోట్లకు చేరింది.

3) హరియాణా: మూడో స్థానంలో హరియాణా ఉంది. ఈ రాష్ట్ర సీఏజీఆర్(CAGR) 6.8% గా ఉంది. జీఎస్ డీపీ విషయానికి వస్తే 2012లో హరియాణా GSDP రూ. 2.97 లక్షల కోట్లు కాగా, అది 2021వ సంవత్సరం నాటికి రూ. 5.36 లక్షల కోట్లకు చేరింది.

4) మధ్య ప్రదేశ్: వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో నాలుగో స్థానంలో మధ్య ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్ర జీఎస్డీపీ(GSDP) 2012లో రూ. 3.16 లక్షల కోట్లు కాగా, 2021లో రూ. 5.65 లక్షల కోట్లు. అలాగే, మధ్య ప్రదేశ్ సీఏజీఆర్(CAGR) 6.7%.

5) ఆంధ్ర ప్రదేశ్: వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఐదో స్థానంలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్ర జీఎస్డీపీ(GSDP) 2012లో రూ. 3.79 లక్షల కోట్లు కాగా, 2021లో అది రూ. 6.70 లక్షల కోట్లు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ సీఏజీఆర్(CAGR) 6.5%. అయితే, 2012 ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది. 2014లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ దేశంలో ఏడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ.

6) తెలంగాణ: మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. అలాగే, ఎనిమిదేళ్ల తెలంగాణ సీఏజీఆర్(CAGR) ప్రస్తుతం 6.1% గా ఉంది. అలాగే తెలంగాణ జీఎస్ డీపీ(GSDP) 2012లో రూ. 3.59 లక్షల కోట్లు కాగా, 2021లో అది రూ. 6.10 లక్షల కోట్లు.

7) తమిళనాడు: వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఏడో స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రాష్ట్ర సీఏజీఆర్ 5.8%. 2021లో ఈ రాష్ట్ర జీఎస్డీపీ(GSDP) రూ. 12. 46 లక్షల కోట్లు.

8) ఒడిశా: ఈ రాష్ట్ర CAGR 5.73%. అలాగే, GSDP రూ. 3.81 లక్షల కోట్లు.

9) ఢిల్లీ: 5.67 వృద్ధి రేటు(CAGR)తో రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో 9 వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్ర GSDP 2012లో రూ.3.44 లక్షల కోట్లు కాగా, 2021లో అది రూ. 5.65 లక్షల కోట్లకు చేరింది.

10) అస్సాం: జీఎస్పీడీ(GSDP) వృద్ధి రేటు పరంగా ఈ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. ఈ ఈశాన్య రాష్ట్ర జీఎస్డీపీ 2021లో రూ. 2.28 లక్షల కోట్లు. సీఏజీఆర్(CAGR) 5.3%.

  • ఈ జాబితాలో చివరి స్థానాల్లో వరుసగా 3.9% వృద్ధి రేటుతో కేరళ, 4.1% వృద్ధి రేటుతో జమ్మూకశ్మీర్, 4.2% వృద్ధి రేటుతో జార్ఖండ్ ఉన్నాయి.
  • అన్ని రాష్ట్రాల 2022 ఆర్థిక సంవత్సర గణాంకాలు అందుబాటులో లేనందున, 2021 ఆర్థిక సంవత్సర గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు.
  • చిన్న రాష్ట్రాల్లో మిజోరం వృద్ధి రేటు అత్యధికంగా 7.9 శాతంగా ఉంది. ఆ రాష్ట్ర జీఎస్డీపీ 14.4 వేల కోట్లు. ఆ తరువాతి స్థానంలో మేఘాలయ ఉంది.
  • భారత దేశ జీడీపీ కూడా గణనీయ వృద్ధి సాధించింది. 2012లో ఇండియా జీడీపీ రూ. 87.36 లక్షల కోట్లు కాగా, 2022లో అది రూ. 147.36 లక్షల కోట్లు. దాదాపు ఏటా 5.4% వృద్ధి రేటును భారత్ సాధిస్తోంది.

టాపిక్

తదుపరి వ్యాసం