OnePlus Pad launch : వన్‌ప్లస్ ‘ట్యాబ్లెట్’.. లాంచ్ డేట్ ఇదేనా?
15 November 2022, 10:31 IST
- OnePlus tablet launch date : వన్‌ప్లస్ ట్యాబ్లెట్ లాంచ్‌కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ టిప్‌స్టర్ చెప్పారు. ఆ వివరాలు..
వన్‌ప్లస్ ట్యాబ్లెట్ లాంచ్ డేట్ ఇదేనా?
OnePlus Pad launch date : ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ వన్‌ప్లస్.. ట్యాబ్లెట్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టనుందని గత కొంత కాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంపై వన్‌ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ట్యాబ్లెట్‌పై స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఈ ట్యాబ్లెట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, వచ్చే ఏడాది ఇది లాంచ్ అవ్వొచ్చని సమాచారం.
లాంచ్ డేట్ ఇదేనా?
స్మార్ట్‌ఫోన్స్ నుంచి స్మార్ట్ టీవీలు, వేరెబుల్స్, ఆడియో ప్రాడక్ట్స్ వరకు వివిధ సెగ్మెంట్లో వన్‌ప్లస్ వ్యాపారం చేస్తోంది. ఇక వన్‌ప్లస్ ట్యాబ్లెట్ గురించి దాదాపు ఏడాదిగా మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయి. ఇది 2022 తొలి భాగంలో లాంచ్ అవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. అనాధికారిక సమాచారం ప్రకారం.. 2023 జనవరిలో ఇది లాంచ్ అవ్వనుంది!
OnePlus tablet launch in India : ఇక ఈ వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌పై ఇప్పుడు ఓ టిప్‌స్టర్ మాట్లాడారు.
"వన్‌ప్లస్ నుంచి ఓ ట్యాబ్లెట్ వస్తోంది. ఇది డెవెలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. వచ్చే ఏడాది లాంచ్‌కు సిద్ధమవుతోంది," అని టిప్‌స్టర్ మ్యాకస్ జామ్బోర్ తెలిపారు.
రానున్న రోజుల్లో ఈ డివైజ్‌పై మరింత అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది.
చివరిసారిగా.. ఈ ఏడాది జులైలో వన్‌ప్లస్ ప్యాడ్‌పై వార్తలొచ్చాయి. దీనికి 'వన్‌ప్లస్ రీవ్స్' అనే పేరు పెట్టినట్టు ఓ టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇండియాలో ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్టు వివరించారు.
వన్‌ప్లస్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్ ఇవే..
OnePlus tablet specifications : వన్‌ప్లస్ ట్యాబ్లెట్‌కు సంబంధించి.. స్పెసిఫికేషన్లపైనా రూమర్స్ వచ్చాయి. ఇందులో ఆండ్రాయిడ్ 12ఎల్ ఉంటుందని తెలుస్తోంది. 12.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండొచ్చు. క్వాల్కమ్డ్రాగన్ 86ఎస్ఓసీతో పాటు ఈ డివైజ్‌లో 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ ట్యాబ్లెట్లో డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అవి.. 13ఎంపీ మెయిన్ కెమెరా, 5ఎంపీ సెకండరీ కెమెరాగా తెలుస్తోంది. సెల్ఫీ కోసం ఫ్రంట్‌లో 8ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 10,900ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని టిప్స్ వచ్చాయి.
OnePlus tablet price in India : ఎన్ని వార్తలు వస్తున్నా.. తొలి ట్యాబ్లెట్ డివైజ్‌పై మాత్రం వన్‌ప్లస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలదు. అయితే.. ఇది ఇండియాలో రూ. 34,500 ధరతో లాంచ్ అవ్వొచ్చని తెలుస్తోంది.