తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 12r : వన్​ప్లస్​ 12ఆర్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. ఇక స్టోరేజ్​ కష్టాలు దూరం!

OnePlus 12R : వన్​ప్లస్​ 12ఆర్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. ఇక స్టోరేజ్​ కష్టాలు దూరం!

Sharath Chitturi HT Telugu

22 March 2024, 12:15 IST

  • OnePlus 12R new variant : వన్​ప్లస్​ 12ఆర్ స్మార్ట్​ఫోన్​లో​ కొత్త వేరియంట్​ లాంచ్​ అయ్యింది. ఇక స్టోరేజ్​ కష్టాలు దూరమవుతాయి! ఈ కొత్త వేరియంట్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

వన్​ప్లస్​ 12ఆర్​లో కొత్త వేరియంట్​..
వన్​ప్లస్​ 12ఆర్​లో కొత్త వేరియంట్​.. (OnePlus)

వన్​ప్లస్​ 12ఆర్​లో కొత్త వేరియంట్​..

OnePlus 12R price in India : ఇండియన్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఫోకస్​ చేసిన వన్​ ప్లస్​ సంస్థ.. తాజాగా, తన బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​లో కొత్త వేరియంట్​ని లాంచ్​ చేసింది. అది.. వన్​ప్లస్​ 12 8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​. ఈ మోడల్​లో ఇప్పటికే.. 8 జీబీ ర్యామ్​ / 128 జీబీ స్టోరేజ్​, 16 జీబీ ర్యామ్​/ 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

వన్ ​ప్లస్​ 12ఆర్ ధర, ఆఫర్లు..

వన్ ప్లస్ 12ఆర్ 8జీబీ/256జీబీ వేరియంట్ ధర ధర రూ.42,999గా ఉంది. కాంపిటీటివ్​ ప్రైజ్​లో మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను అందిస్తోంది వన్​ ప్లస్​. సంస్థ అధికారిక వెబ్​సైట్​, వన్​ప్లస్​ స్టోర్ యాప్, అమెజాన్, వన్​ప్లస్​ ఎక్స్​పీరియెన్స్​ స్టోర్లు, దేశవ్యాప్తంగా ఆఫ్​లైన్​ ఔట్​లెట్స్​తో సహా ఇతర స్మార్ట్​ఫోన్ స్టోర్స్​ ద్వారా ఈ కొత్త వేరియంట్​ని కొనుగోలు చేసుకోవచ్చు.

OnePlus 12R price : వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్​ కొత్త వేరియంట్​పై పలు అట్రాక్టివ్​ డిస్కౌంట్స్​ కూడా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, వన్ కార్డ్ కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్​స్టంట్​ బ్యాంక్ డిస్కౌంట్, పాత డివైస్లపై రూ.3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి లభిస్తున్నాయి. వన్​ప్లస్​ నార్డ్ ఫోన్ నుంచి అప్​గ్రేడ్​ అయ్యే యూజర్లకు.. అదనంగా రూ.1,000 బోనస్ లభిస్తుండటం విశేషం. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు రూ.4,999 విలువైన వన్​ప్లస్​ బడ్స్ జెడ్2ను ఉచితంగా పొందుతార! ప్రముఖ బ్రాండ్ల ద్వారా 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందొచ్చు. అంతేకాదు.. నెలకు రూ. 150 తగ్గింపుతో 15 నెలల పాటు జియో నుంచి బెనిఫిట్స్​ పొందొచ్చు.

ఇదీ చూడండి:- Realme Narzo 70 Pro 5G: ఈ స్మార్ట్ ఫోన్ ను టచ్ చేయకుండానే ఆపరేట్ చేయొచ్చు; సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా కూడా ఉంది

వన్ ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్లు..

వన్ ప్లస్ 12ఆర్ 8జీబీ/256జీబీ వేరియంట్ అద్భుతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్​ను అందిస్తుంది. ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది ఈ స్మార్ట్​ఫోన్​​. 6.78 ఇంచ్​ ఎల్టీపీవో 4.0 అమోలెడ్ డిస్ప్లేతో, వినియోగదారులు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో వైబ్రెంట్ విజువల్స్​ని ఆస్వాదించవచ్చు. స్మూత్ స్క్రోలింగ్- అంతరాయం లేని మల్టీమీడియా ప్లేబ్యాక్స్​ని ఆస్వాదిస్తారు.. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్, అడ్రినో జీపీయూతో జత చేసిన ఈ ఫోన్ సమర్థవంతమైన పనితీరు, గ్రాఫిక్స్ రెండరింగ్ కోసం పనిచేస్తుంది.

OnePlus 12R new variant price : ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. ఈ పరికరం 256 జీబీ యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్​తో తగినంత స్పేస్​ అందిస్తుంది. ఇది వినియోగదారులకు ఇష్టమైన గేమ్స్, ఫోటోలు, వీడియోలను సులభంగా స్టోర్​ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్​.. వినియోగదారులకు స్మూత్ అండ్ ఇంట్యూటివ్ సాఫ్ట్​వేర్​ అనుభవాన్ని అందిస్తుంది.

తదుపరి వ్యాసం