తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Noise Colorfit Vivid Call: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ విడుదల: ధర, ఫీచర్ల వివరాలివే

Noise ColorFit Vivid Call: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ విడుదల: ధర, ఫీచర్ల వివరాలివే

23 April 2023, 15:44 IST

    • Noise ColorFit Vivid Call Smartwatch: నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్‍, 550 నిట్స్ బ్రైట్‍నెస్ డిస్‍ప్లేతో వచ్చింది.
Noise ColorFit Vivid Call: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్ మరో స్మార్ట్‌వాచ్ విడుదల (Photo: Noise)
Noise ColorFit Vivid Call: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్ మరో స్మార్ట్‌వాచ్ విడుదల (Photo: Noise)

Noise ColorFit Vivid Call: బ్లూటూత్ కాలింగ్‍తో నాయిస్ మరో స్మార్ట్‌వాచ్ విడుదల (Photo: Noise)

Noise ColorFit Vivid Call Smartwatch: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‍లు వరుసగా మార్కెట్‍లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ బ్రాండ్ నాయిస్ (Noise) మరో వాచ్‍ను తీసుకొచ్చింది. నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ (Noise ColorFit Vivid Call) స్మార్ట్‌వాచ్ తాజాగా లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్టును ఈ వాచ్ కలిగి ఉంది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే డిస్‍ప్లే ఈ స్మార్ట్‌వాచ్‍కు ఉంటుంది. నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ పూర్తి వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్పెసిఫికేషన్లు

Noise ColorFit Vivid Call Smartwatch: మెటాలిక్ ఫినిష్‍తో కూడిన బాడీని ఈ నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. డిజైన్ కూడా స్లీక్‍గా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ వాచ్ కలిగి ఉంది. ఇందుకోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్ ఫీచర్‌తో పాటు 10 కాంటాక్టుల వరకు ఈ వాచ్‍లో సేవ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లో నోటిఫికేషన్లు పొందవచ్చు.

Noise ColorFit Vivid Call: 1.69 ఇంచుల డిస్‍ప్లేను నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 100కుపైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లు ఉంటాయి. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

260mAh బ్యాటరీతో నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని నాయిస్ పేర్కొంది. వాయిస్ అసిస్టెంట్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్‍లో నాయిస్ ఫిట్ యాప్‍నకు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ కలర్‌ఫిట్ వివిద్ కాల్ వాచ్ కలిగి ఉంది.

నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ ధర, సేల్

Noise ColorFit Vivid Call Smartwatch: నాయిస్ కలర్‌ఫిట్ వివిద్ కాల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,699గా ఉంది. ముందుగా రూ.1,299 ఇంట్రడక్టరీ ధరకు వచ్చిన ఈ వాచ్.. ప్రస్తుతం రూ.1,699 ధరకు లభిస్తోంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, నాయిస్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ లభిస్తోంది. స్పేస్ బ్లూ, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్, రోజ్ పింక్, డీప్ వైన్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం