తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5g Smartphones : ఇండియాలో.. ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

5G smartphones : ఇండియాలో.. ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

06 November 2023, 15:35 IST

  • Budget friendly 5G smartphones :  బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని మీకోసం మేము రూపొందించాము. ఓ లుక్కేసేయండి…

ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!
ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే! (HT Tech)

ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Budget friendly 5G smartphones : కొత్తగా ఒక 5జీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? కొనే మొబైల్​.. బడ్జెట్​ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో లభిస్తున్న ది బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ను ఇక్కడ చూడండి..

ట్రెండింగ్ వార్తలు

Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..

Motorola Edge 50 Fusion launch: ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్; స్పెసిఫికేషన్లు, ధర వివరాలు

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

బెస్ట్​ 5జీ స్మార్ట్​ఫోన్స్​..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం14 5జీ:- ఈ మొబైల్​లో యూజర్​ ఎక్స్​పీరియన్స్​ చాలా బాగుంటుంది. 13 5జీ బ్యాండ్స్​ని ఇది సపోర్ట్​ చేస్తుంది. ఫలితంగా కనెక్టివిటీ అనేది చాలా ఫాస్ట్​గా ఉంటుంది. ఇందులో ఎక్సినోస్​ 1330 ఆక్టా కోర్​ 2.4 జీహెచ్​జెడ్​ ప్రాసెసర్​ ఉంటుంది. 6.6 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఇందులో ఉంటుంది. ఈ మొబైల్​ ధర రూ. 18,990గా ఉంది.

Best 5G smartphones : రియల్​మీ 11 ప్రో 5జీ:- రియల్​మీ 11 ప్రో 5జీలో 120హెచ్​జెడ్​తో కూడిన కర్వ్​డ్​ డిస్​ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 7050 5జీ చిప్​సెట్​ దీని సొంతం. 100ఎంపీ ప్రోలైట్​ కెమెరా కూడా వస్తోంది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ఆప్షన్​ ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. అంతేకాకుండా.. కేవలం 18 నిమిషాల్లోనే ఈ స్మార్ట్​ఫోన్​ని 50శాతం వరకు రీఛార్జ్​ చేయవచ్చు. దీని ధర రూ. 26,999.

నోకియా జీ42 5జీ:- నోకియా జీ42 అనేది ఒక బడ్జెట్​ ఫ్రెండ్లీ 5జీ ఆప్షన్​. దీని ధర రూ. 16,499. ఇందులో స్నాప్​డ్రాగన్​ 480 ప్లస్​ 5జీ చిప్​సెట్​ ఉంటుంది. 11జీబీ ర్యామ్​ వస్తోంది. 50ఎంపీ ట్రిపుల్​ రేర్​ ఏఐ కెమెరా సైతం లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

Redmi 12 5G price in India : రెడ్​మీ 12 5జీ:- ఇందులో స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంటుంది. 50ఎంపీ ఏఐ డ్యూయెల్ రేర్​​ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, 22.5వాట్​ ఛార్జర్​ వస్తున్నాయి. ఆండ్రాయిడ్​ 13పై ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. మార్కెట్​లో ఈ రెడ్​మీ 12 5జీ ధర రూ. 19,999గా ఉంది.

టాప్​ 5 వివో స్మార్ట్​ఫోన్స్​..

అడ్వాన్స్డ్ ఫీచర్స్​తో, ప్రీమియం లుక్స్​తో వివో ఫోన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మీ ఆత్మీయులకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే, రూ. 25వేల లోపు ధరలో ఈ స్మార్ట్ ఫోన్స్​ను పరిశీలించండి.

Best Vivo smartphones : వివో వై 27 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ+ 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఇది 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.64-అంగుళాల ఫుల్​హెచ్​డీ+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.18999 కి కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం