తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Price Drop : ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపు.. ఇదే ది బెస్ట్​ డీల్​! త్వరపడండి..

iPhone 15 price drop : ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపు.. ఇదే ది బెస్ట్​ డీల్​! త్వరపడండి..

Sharath Chitturi HT Telugu

30 December 2023, 8:55 IST

  • iPhone 15 price drop : ఐఫోన్​ 15 ధరపై ఇప్పుడు భారీ తగ్గింపు లభిస్తోంది. ఇదే బెస్ట్​ డీల్​ అని టెక్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపు.. ఇదే ది బెస్ట్​ డీల్​!
ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపు.. ఇదే ది బెస్ట్​ డీల్​! (Apple)

ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపు.. ఇదే ది బెస్ట్​ డీల్​!

iPhone 15 price drop : ఐఫోన్​ 15 ధర తగ్గితే కొనాలని చూస్తున్న వారికి క్రేజీ వార్త! కొన్ని నెలల క్రితమే లాంచ్​ అయిన ఈ యాపిల్​ ఐఫోన్​ కొత్త స్మార్ట్​ఫోన్​పై అమెజాన్​లో భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా.. పలు బ్యాంక్​ ఆఫర్స్​తో ఈ ధర మరింత దిగొస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న ఎస్​యూవీలు ఇవే..!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

ఐఫోన్​ 15 ధర తగ్గింపు..

2023 సెప్టెంబర్​లో ఐఫోన్​ 15 సిరీస్​ లాంచ్​ అయ్యింది. ఇందులోని బేస్​ మోడల్​ ఐఫోన్​ 15 ధర రూ. 79,990. కాగా.. అమెజాన్​లో ఇప్పుడు ఇది రూ. 74,990కి దిగొచ్చింది. అంతేకాకుండా.. పలు బ్యాంక్​ ఆఫర్స్​తో ఈ ధర మరింత తగ్గుతోంది. అమెజాన్​ పే ఐసీఐసీఐ బ్యాంక్​ కార్డు వినియోగదారులు.. ఈ స్మార్ట్​ఫోన్​పై రూ. 3,745 విలువ చేసే 5శాతం క్యాష్​ బ్యాక్​ పొందొచ్చు. అంటే.. రూ. 79,990గా ఉండే కొత్త యాపిల్ ఐఫోన్​ 15 ధర.. ఇప్పుడు రూ. 71,245కే వస్తున్నట్టు!

iPhone 15 price cut : సాధారణంగా.. యాపిల్​ ఐఫోన్​ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​ అయిన కొన్ని నెలల వరకు.. వాటిపై పెద్దగా డిస్కౌంట్స్​ ఉండవు. కానీ ఇప్పుడు ఐఫోన్​ 15పై ధర తగ్గుతుండటం సూపర్​ అని టెక్​ నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్​ఫోన్​ని కొనాలని చూస్తున్న వారికి.. ఇది బెస్ట్​ డీల్​ అని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:- iPhone passcode security: 4 అంకెల ఐఫోన్ పాస్ కోడ్ తో చాలా డేంజర్; ఐ ఫోన్ లోని మీ డేటా సేఫ్టీ కోసం ఇలా చేయండి..

ఐఫోన్​ 15 ఫీచర్స్​ ఇవే..

ఐఫోన్​ 15లో డైనమిక్​ ఐలాండ్​ అనే కొత్త టెక్నాలజీ ఉంటుంది. ఇది.. ట్రెడీషనల్​ నాచ్​ని రిప్లేస్​ చేస్తుంది. ఫలితంగా యూజర్​ ఎక్స్​పీరియెన్స్​ మరింత మెరుగైంది.

iPhone 15 price cut details : ఇక ఈ స్మార్ట్​ఫోన్​లో 6.1 ఇంచ్​ డిస్​ప్లే ఉంది. 2000 నిట్స్​ బ్రైట్​నెస్​తో స్క్రీన్​ వస్తోంది. ఇందులో ఎన్​హాన్స్​డ్​ కెమెరా సిస్టెమ్​ ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన క్వాడ్​ పిక్సెల్​ సెన్సార్​ సెటప్​ దీని సొంతం. 24ఎంపీ సూపర్​ హై రిసొల్యూషన్​ కెమెరా కూడా ఇందులో ఉంది. 2ఎక్స్​ టెలిఫొటో లెన్స్​ సైతం లభిస్తోంది. ఈ మొబైల్​లో సరికొత్త స్మార్ట్​ హెచ్​డీఆర్​ సిస్టెమ్​ ఉంది. మేన్యువల్​ మోడ్​ స్విచ్చింగ్​ అవసరం లేకుండా.. ఇంది ఆటోమెటిక్​గా పోట్రైట్​ ఫొటోలను క్యాప్చర్​ చేస్తుంది.

iPhone 15 features : ఐఫోన్​ 15లో ఏ16 బయోనిక్​ ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంటుంది. రెండు హై పర్ఫార్మింగ్​ కోర్స్​ ఉండటంతో.. పవర్​ వినియోగం అనేది 20శాతం తగ్గుతుంది. 6 కోర్​ సీపీయూ కూడా ఉండటంతో ఓవరాల్​ పర్ఫార్మెన్స్​ సూపర్​గా ఉంటుంది.

తదుపరి వ్యాసం