తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Price Cut : ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు- ఇదే సూపర్​ డీల్​! మిస్స్​ అవ్వకండి..

iPhone 15 price cut : ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు- ఇదే సూపర్​ డీల్​! మిస్స్​ అవ్వకండి..

Sharath Chitturi HT Telugu

27 February 2024, 6:40 IST

  • iPhone 15 price drop : ఐఫోన్​ 15 కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! అమెజాన్​లో ఈ గ్యాడ్జెట్​పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది.

ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు- ఇదే సూపర్​ డీల్​! మిస్స్​ అవ్వకండి..
ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు- ఇదే సూపర్​ డీల్​! మిస్స్​ అవ్వకండి.. (Unsplash)

ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు- ఇదే సూపర్​ డీల్​! మిస్స్​ అవ్వకండి..

iPhone 15 price cut : యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! ఐఫోన్​ 15 స్మార్ట్​ఫోన్​ని ఇంకా కొనని వారికి అద్భుతమైన అవకాశం! ఐఫోన్​ 15 ధరపై భారీ తగ్గింపును ప్రకటించింది దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​. ఆ తర్వాత, బ్యాంక్​ ఆఫర్స్​ అప్లై అవుతుండటంతో.. ధర మరింత దిగొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐఫోన్​ 15పై భారీ తగ్గింపు..

అమెజాన్​లో ఐఫోన్​ 15 128 జీబీ వేరియంట్​ వాస్తవ ధర రూ. 79,900గా ఉండేది. ఇక ఈ ప్రైజ్​పై 11 పర్సెంట్​ డిస్కౌంట్​ని ప్రకటించింది అమెజాన్​. అంటే.. అమెజాన్​లో ఐఫోన్​ 15ని రూ. 70,999కే కొనుగోలు చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 8,901 డిస్కౌంట్​ లభిస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోలేదు!

Amazon discounts on iPhone 15 : అమెజాన్​ డిస్కౌంట్​తో పాటు ఐఫోన్​ 15పై ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​, బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉన్నాయి! అవి మరింత ఎగ్జైటింగ్​గా ఉన్నాయి.

ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద.. ఐఫోన్​ కొత్త స్మార్ట్​ఫోన్​పై భారీ తగ్గింపును ఇస్తోందని అమెజాన్​. ఏదైనా పాత ఫోన్​ ఇస్తే, దాని పనితీరు బట్టి గరిష్ఠంగా రూ. 17,300 వరకు ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ని ఇస్తోంది. అయితే.. ఇది ప్రతి చోట అందుబాటులో ఉండదు! మీ పిన్​ కోడ్​ని ఎంటర్​ చేసి, ఈ ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ఉందా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలి. ఏది ఏమైనా.. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ లభిస్తే.. ఐఫోన్​ 15 ధర ఇంకా తగ్గుతుంది.

ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​తో పాటు పలు బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉన్నాయి! హెచ్​ఎస్​బీసీ క్రెడిట్​ కార్డ్​ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్​పై రూ. 150 వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. వీటితో పాటు ఇతర బ్యాంక్​ ఆఫర్స్​ కూడా ఉన్నాయి. నో కాస్ట్​ ఈఎంఐ ఆప్షన్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. చెక్​ చేయండి.

iPhone 15 price drop in India : ఈ విధంగా.. ఐఫోన్​ 15పై అమెజాన్​ డిస్కౌంట్​తో పాటు ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​, బ్యాంక్​ ఆఫర్స్​ పొంది.. కొత్త గ్యాడ్జెట్​ని కొనాలన్న మీ కలను నెరవేర్చుకోవచ్చు!

ఐఫోన్ 15 ప్లస్​పై భారీ డిస్కౌంట్..

ప్రస్తుతం ఐఫోన్​ 15పై భారీ డిస్కౌంట్​ని ప్రకటించిన అమెజాన్​.. కొన్ని రోజుల క్రితమే.. ఐఫోన్​ 15 ప్లస్​పై భారీ తగ్గింపును ఇచ్చింది. ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర రూ.89,900గా ఉంది. అయితే, ఆమెజాన్​లో ఈ ప్రీమియం స్మార్ట్​ఫోన్ భారీ డిస్కౌంట్​తో పొందొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో వంటి 5 కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అమెజాన్​లో ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్​పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డిస్కౌంట్​తో ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్​ఫోన్ ధర రూ. 80990 లకు తగ్గుతుంది. అంటే, దాదాపు రూ.8910 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు ఐఫోన్ 15 ప్లస్​పై ఉన్న ఇతర బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం