తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indusind Bank Dividend: స్టాక్ మార్కెట్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ దూకుడు; షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

IndusInd Bank dividend: స్టాక్ మార్కెట్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ దూకుడు; షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

HT Telugu Desk HT Telugu

24 May 2023, 15:53 IST

    • IndusInd Bank dividend: 2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో సాధించిన మంచి ఫలితాల కారణంగా షేర్ మార్కెట్లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు దూసుకుపోతున్నాయి. మే 24, బుధవారం 52 వారాల గరిష్టానికి చేరువయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మే 24, బుధవారం ఇండస్ఇండ్ బ్యాంక్ (indusind bank) షేర్లు రూ. 1245.25 వద్ద ట్రేడ్ అవడం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఈ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఇంట్రా డే హై రూ. 1275 కి చేరాయి.అలాగే, 52 వారాల గరిష్టానికి చేరువయ్యాయి. చివరకు రూ. 1271.75 వద్ద ముగిశాయి. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసిన డివిడెండ్ ప్రకటనతో ఈ షేర్ల ర్యాలీ మరింత వేగంగా కొనసాగింది.

IndusInd Bank results: రూ. 14 డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు బ్యాంక్ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 14 ల ఫైనల్ డివిడెండ్ ను కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ గా జూన్ 2 వ తేదీని ప్రకటించింది. Q4FY23 లో ఇండస్ ఇండ్ బ్యాంక్ రూ. 2,040.51 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇవి Q4FY22 లో బ్యాంక్ సాధించిన రూ. 1,361.37 నికర లాభాల కన్నా సుమారు 50% అధికం. అలాగే Q4FY23 లో ఇండస్ ఇండ్ బ్యాంక్ రూ. 4,669.46 కోట్ల నికర వడ్డీ ఆదాయం (Net interest income) పొందింది. Q4FY22 కన్నా ఇది 17% అధికం. Q4FY23 లో ఇండస్ ఇండ్ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 6,823 కోట్లు. బ్యాంక్ ఎన్పీఏ (NPA) విలువ కూడా Q3FY23 లో ఉన్న 0.62% నుంచి కొంత తగ్గి 0.59 శాతానికి చేరాయి.

తదుపరి వ్యాసం