తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iob Rates: ఎఫ్ డీ వడ్డీ రేట్లను సవరించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్;

IOB rates: ఎఫ్ డీ వడ్డీ రేట్లను సవరించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్;

HT Telugu Desk HT Telugu

08 April 2023, 18:04 IST

    • ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేట్లను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank IOB) సవరించింది. మార్చిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రూ. 2 కోట్ల ( 2 crore) లోపు ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేట్లను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank IOB) సవరించింది. మార్చిన వడ్డీ రేట్లు (Interest Rates) ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ రెపొ రేటు (Repo Rate )ను మార్చకపోవడంతో, ప్రస్తుతం ఉన్న 6.5% రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లను ఐఓబీ సవరించింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

IOB FD Rates: కొన్ని డిపాజిట్లపై పెంపు, కొన్నింటిపై తగ్గింపు

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కొన్నింటిపై 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన బ్యాంక్, మరికొన్ని డిపాజిట్లపై వడ్డీ రేటు (Interest Rates) ను 40 బేసిస పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

IOB FD Rates: 444 రోజుల ఎఫ్ డీ లపై..

444 రోజుల కాల వ్యవధితో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) పై సవరించిన వడ్డీ రేట్ (Interest Rates) ప్రకారం 7.25% వడ్డీ లభిస్తుంది. ఇది గతంలో 7% మాత్రమే ఉండేది. అలాగే,

  • 7 నుంచి 29 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 4% నుంచి 4.5 శాతానికి పెంచారు.
  • 30 నుంచి 45 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 4.25 % నుంచి 4.5 శాతానికి పెంచారు.
  • 46 నుంచి 90 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 4.75 % నుంచి 4.25 శాతానికి తగ్గించారు.
  • 91 నుంచి 179 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 4.2% నుంచి 4.5 శాతానికి పెంచారు.
  • 180 నుంచి 269 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 4.85% నుంచి 4.95 శాతానికి పెంచారు.
  • 270 నుంచి 365 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 5.25% నుంచి 5.35 శాతానికి పెంచారు.
  • ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 6.40% నుంచి 6.50 శాతానికి పెంచారు.
  • 444 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 7% నుంచి 7.25 శాతానికి పెంచారు.
  • 2 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి గల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FD) పై వడ్డీ రేటును 6.4% నుంచి 6.8 శాతానికి పెంచారు.
  • 3 సంవత్సరాలు ఆ పై కాల వ్యవధి కలిగిన ఫిక్స్ డ్ డిపాజట్ల (FD) పై వడ్డీ రేటు పై ఎలాంటి మార్పు చేయలేదు. ఆ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.
  • ఐఓబీ టాక్స్ సేవర్ డిపాజిట్ (IOB Tax Saver Deposit) స్కీమ్ వడ్డీ రేటు కూడా 6.5% గానే కొనసాగుతుంది. ఈ స్కీమ్ లోని డిపాజిట్ దారులకు సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను రాయితీ లభిస్తుంది.
  • పై అన్ని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.5% అదనపు వడ్డీ, 80 ఏళ్ల వయస్సు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.75% అదనపు వడ్డీ లభిస్తుంది.

తదుపరి వ్యాసం