తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Icici Bank Q1 Results : 40 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ1 లాభాలు

ICICI Bank Q1 results : 40 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ1 లాభాలు

HT Telugu Desk HT Telugu

22 July 2023, 19:54 IST

    • ICICI Bank Q1 Results: భారత్ లోని దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను శనివారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) తో పోలిస్తే, Q1FY24 లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు దాదాపు 40% పెరిగాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ICICI Bank Q1 Results: భారత్ లోని దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను శనివారం ప్రకటించింది. Q1FY24 లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 9,648 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) తో పోలిస్తే, Q1FY24 లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు 39.7% పెరిగాయి. Q1FY23 లో బ్యాంక్ రూ. 6,905 కోట్ల లాభాలను ఆర్జించింది.

Net interest income: వడ్డీ ఆదాయం పెరిగింది

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) నికర వడ్డీ ఆదాయం (net interest income NII) లో 38% మెరుగుదల నమోదైంది. ఈ Q1FY24 బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ 18,227 కోట్లు కాగా, Q1FY23లో బ్యాంక్ రూ. 13,210 కోట్ల నికర వడ్డీ ఆదాయం సాధించింది. ఈ క్యూ 1 లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 4.01% నుంచి 4.78 శాతానికి పెరగడం విశేషం. ట్రెజరీ లాభాలను మినహాయించి, ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల ఆపరేటింగ్ ఆదాయం రూ. 13,887 కోట్లుగా ఉంది. Q1FY23లో అది రూ. 10,273 కోట్లు.

ఎన్పీఏల విషయంలో కూడా..

స్థూల నిరర్ధక ఆస్తుల (GNPAs) విలువను తగ్గించే విషయంలో కూడా ఐసీఐసీఐ బ్యాంక్ మెరుగై పనితీరును చూపింది. ఈ క్యూ 1 లో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తుల విలువ రూ. 31,822 కోట్లుగా ఉంది. ఇది గత క్యూ 1 లో రూ. 33,163 కోట్లు. అంటే, గత సంవత్సరం క్యూ1 కన్నా ఈ క్యూ 1 లో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 3.4% తగ్గాయి.

డిపాజిట్లు పెరిగాయి..

ఈ Q1FY24 లో బ్యాంక్ డిపాజిట్లు రూ. 12,38,737 కోట్లకు చేరాయి. ఇవి Q1FY23 లో డిపాజిట్ల కన్నా 17.9% అధికం. జులై 21 న బొంబాయి స్టాక్ మార్కెట్లో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విలువ 0.13% పెరిగి రూ. 996.70 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం