ICICI Bank Q4 results: Q4 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్-icici bank declares final dividend of rs 8 check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Icici Bank Q4 Results: Q4 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్

ICICI Bank Q4 results: Q4 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 05:05 PM IST

ICICI Bank Q4 results: ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) శనివారం 2022 -23 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాలను ప్రకటించింది. ఈ Q4 లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 9,121.87 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ICICI Bank Q4 results: ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) శనివారం 2022 -23 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాలను ప్రకటించింది. ఈ Q4 లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 9,121.87 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ICICI Bank Q4 results: రూ. 8 డివిడెండ్

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తన షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ గా రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 8 లను ఇవ్వాలని నిర్ణయించింది. 2022 -23 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాలతో పాటు ఈ డివిడెండ్ ను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రకటించింది. 2022 -23 ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY23) లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 9,121.87 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22) లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) నికర లాభాలు రూ. 7018.71 కోట్లు.

ICICI Bank Q4 results: ఆదాయం 53 వేల కోట్లు..

Q4FY23 లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 53,922.75 కోట్ల నికర ఆదాయాన్ని సముపార్జించింది. ఇది అంతకుముందు Q4 (Q4FY22) లో సాధించిన ఆదాయం అయిన రూ. 42,834.06 కోట్లతో పోలిస్తే, 25.88% అధికం. Q4FY23 లో బ్యాంక్ నికర ఖర్చులు రూ 38,716.56 కోట్లు అని బ్యాంక్ వెల్లడించింది. కాగా, Q4FY22 లో బ్యాంక్ నికర ఖర్చులు రూ 31,306.02 కోట్లు అని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రకటించింది. Q4FY22 కన్నా Q4FY23 లో బ్యాంక్ డిపాజిట్లు 10.9% పెరిగాయని వెల్లడించింది. Q4FY23 లో మొత్తం 1,180,841 కోట్ల డిపాజిట్లను సమీకరించినట్లు వెల్లడించింది. నెట్ ఎన్పీఏ రేషియో (net NPA ratio) కూడా Q3FY23 లో 0.55% ఉండగా, Q4FY23 లో అది 0.48% కి తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. Q4FY23 లో నికర వడ్డీ ఆదాయం (Net interest income NII) రూ. 17,667 కోట్లని బ్యాంక్ ప్రకటించింది. Q4FY22 లో నికర వడ్డీ ఆదాయం రూ. 12,605 కోట్లతో పోలిస్తే, Q4FY23 నికర వడ్డీ ఆదాయం (Net interest income NII) 40.2% పెరిగిందని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తంగా 480 బ్రాంచ్ లను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రకటించింది.

WhatsApp channel